Advertisement
Google Ads BL

మోడ్రెన్ మహావిష్ణువుగా ప్రభాస్?


ప్రభాస్ ఆదిపురుష్ లో మోడ్రెన్ రాముడిగా కనిపిస్తాడని ఆశపడిన ప్రభాస్ ఫాన్స్ ని దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ని యానిమేటెడ్ రాముడిగా చూపించి డిస్పాయింట్ చేసాడు. ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ రామ బాణం ఎక్కు పెడితే.. ఆయన ఆహార్యానికి అదిరిపోతోంది అని ఫాన్స్ కలలు కన్నారు. వారి కలలు ఆవిరైపోయాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K నుండి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు అశ్విని దత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K లో బాలీవుడ్ తారాగణం అమితాబ్, దీపికా పడుకొనే, దిశా పటాని లు నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందే సూపర్ మూవీ అంటూ చాలారోజులగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాలపై అశ్వనీ దత్ పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. ప్రాజెక్ట్ K గ్రాఫిక్స్ తో కూడుకున్నది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. షూటింగ్ త్వరగా కంప్లీట్ అయినా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నది వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే అని చెప్పారు. అంతేకాకుండా ప్రభాస్ పాత్ర, సినిమా నేపథ్యంపై కూడా అశ్విని దత్ పలు ఆసక్తికర విషయాల్ని రివీల్ చేసారు.

ఈ చిత్రంలో ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో విష్ణువు మోడ్రన్ అవతారం గురించి ఉంటుంది. సెంటిమెంట్ కూడా కావాల్సినంత ఉంటుంది.. అంటూ చెప్పిన అశ్విని దత్ గారు.. ప్రాజెక్ట్ K లో ప్రభాస్ కేరెక్టర్ మోడ్రెన్ మహావిష్ణువుగా ఉండబోతుంది అనేది ఇండైరెక్ట్ గా చెప్పినట్లే అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. ఇంకా ఆయన మాట్లాడుతూ.. యాక్షన్ సీక్వెన్స్ లను పర్యవేక్షించేందుకు నలుగురు ఐదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ లను కూడా తీసుకొచ్చాం.. సినిమాలో మీరు చూసే ప్రతి అంశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అంటూ ప్రాజెక్ట్ K పై ఆయన అంచనాలు పెంచేశారు.

Prabhas as the modern Mahavishnu:

What is Project K mythological connection?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs