Advertisement
Google Ads BL

తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్


నందమూరి బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తారో.. డాన్స్ ల్లో అంతే బాగా స్టెప్స్ వేస్తారు. అన్నిటికి మించి ఆయన డైలాగ్ డెలివరీకి ఫ్యాన్ కానివారుండరు. బాలయ్య బాబు బయట మాట్లాడితే తడబాటు ఉంటుందేమో.. సినిమాల్లో డైలాగ్ చెబితే శత్రువు పంచె తడిచిపోవాలె అన్నట్టుగా ఉంటుంది. బాలయ్య వాయిస్ కి పర్ఫెక్ట్ డైలాగ్ పడితే పూనకాలే. అందుకే ఆయన మాస్ సినిమాలకి అంత క్రేజ్. సింహ, లెజెండ్, అఖండ లాంటి చిత్రాల్లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ అభిమానులని ఊపేశాయి. అయితే వీరసింహారెడ్డి చిత్రాన్ని గోపీచంద్ మలినేని రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

ఇప్పుడు అనిల్ రావిపూడి NBK108ని తెలంగాణ నేపథ్యంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ చిత్రంలో బాలయ్య చేత అనిల్ రావిపూడి తెలంగాణ యాస లో మాస్ డైలాగ్స్ పలికించబోతున్నారట. నడి వయస్కుడిగా బాలకృష్ణని తండ్రిగా చూపించనున్న అనిల్ రావిపూడి ఆయన నోటి వెంట తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించడానికి రెడీ అవుతున్నారట. మరి బాలయ్య నోటి వెంట పవర్ ఫుల్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబితే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు.

ఇక ఈ చిత్రంలో బాలయ్య ఒక్క కేరెక్టర్ లోనే మూడు వేరియేషన్స్ చూపించబోతున్నారట. శ్రీలీల, గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Balayya Dialogues in Telangana Dialect for NBK 108:

Balakrishna Tried A Bit Of Telangana Slang
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs