Advertisement
Google Ads BL

మంచు విష్ణు-విరానికా వెడ్డింగ్ యానివర్సరీ


మంచు ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీ కి పరిచయం అవసరం లేదు. ఆ కుటుంబంలో ఒక్క మోహన్ బాబు భార్య మంచు నిర్మలాదేవి తప్ప  మిగిలిన వారందరూ నటులుగా .  రాణిస్తున్నారు. అయితే వీరిలో మంచు విష్ణులో ఒక ప్రత్యేకత ఉంది. సినిమారంగంలో ఉన్న తను అప్పటి ముఖ్యమంత్రి వై. యస్ రాజశేఖర్ రెడ్డి మేనకోడలు విరానికా రెడ్డిని ప్రేమించి 2009 లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వారికి నలుగురు పిల్లలు. 

Advertisement
CJ Advs

అటు నటుడుగా రాణిస్తూనే ఒకడుగు ముందుకు వేసి మా అధ్యక్షులుగా పోటీచేసి అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ గెలుపొందడం జరిగింది. నటుడుగా, నిర్మాతగా (24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ), మా  అసోసియేషన్ అధ్యక్షులుగా మరో వైపు తండ్రి స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటూ బిజీగా ఉన్న తనకు అండగా నిలబడింది భార్య విరానికా రెడ్డి, తను రాజకీయ కుటుంబం నుండి వచ్చినా కూడా డిజైనర్ గా ప్రత్యేకతని చాటుతూ.. మోహన్ బాబు విద్యా సంస్థలలోని న్యూయార్క్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రాణిస్తున్న తను తాజాగా లండన్, దుబాయ్, దోహ వంటి వివిధ దేశాలలో కూడా బోటిక్ సంబందించిన  బ్రాంచి లను నెలకొల్పడానికి సిద్దమైంది. 

ఇద్దరూ డిఫరెంట్ రంగాల్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి రోజు మార్చి 1. ఈ సందర్బంగా వీరు ఇలాగే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ బిజినెస్ పరంగా, సినిమా పరంగా రాణిస్తూ సక్సెస్ కపుల్ గా నిలవాలని కోరుకుంటూ వారికి సినీజోష్ టీమ్ తరుపున పెళ్లి రోజు శుభాకాంక్షలు..

Manchu Vishnu - Viranica wedding anniversary:

Manchu Vishnu - Viranica Reddy 13th wedding anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs