Advertisement
Google Ads BL

లిస్ట్ లో శ్రీలీల పేరు లేదుగా..


శ్రీలీల యంగ్ హీరోల అవకాశాలతో దూసుకుపోతున్న తార. పెళ్లి సందD, ధమాకా చిత్రాల్లో ఆమె అందం, ఆమె నృత్యానికి మైమరిచిపోతున్న యంగ్ హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేస్తున్నారు. మెగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న శ్రీలీల పేరు.. పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలిసి నటించబోతున్న తమిళ రీమేక్ విషయంలో బాగా వినబడుతుంది. నిన్నగాక మొన్న ఐటెం సాంగ్ లో శ్రీలీల అన్నారు. ఇప్పుడు పవన్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది అంటూ రాసేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈరోజు PSPK-SDT మూవీ అప్ డేట్ నుండి వచ్చిన లిస్ట్ లో అసలు శ్రీలీల పేరే లేదు. పవన్ కళ్యాణ్-సాయి తేజ్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అంటూ దర్శకుడు సముద్రఖని పిక్స్ షేర్ చేసిన మేకర్స్ ఇకపై అప్ డేట్స్ వస్తూనే ఉంటాయంటూ మరింత ఆసక్తిని కలిగించారు. దానితో పాటు మూవీలో నటిస్తున్న నటుల పేర్లని రివీల్ చేసారు. ముందుగా అనుకున్నట్టుగానే సాయి తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తుంది. ఇంక పవన్ కళ్యాణ్ పేరు సోలోగా వేశారు. అలాగే రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణిల పేర్లు వేశారు కానీ.. ఆ లిస్ట్ లో ఎక్కడా శ్రీలీల పేరు మాత్రం వెయ్యలేదు. అంటే మధ్యలో ఎమన్నా ఈ అమ్మాయిని స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతానికైతే శ్రీలీల ఈ ప్రాజెక్ట్ లో లేనట్లే కనిపిస్తుంది.

Sreeleela name is not in the list:

PKSDT movie cast and creaw
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs