Advertisement
Google Ads BL

ఆచార్య సెట్ తగలబడడం వెనుక కారణమదా?


మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమాని దర్శకుడు కొరటాల ధర్మస్థలి అనే భారీ టెంపుల్ సెట్ లో జరిగింది. రామ్ చరణ్ అలాగే చిరంజీవి ఇద్దరూ ఈ సెట్ లోనే ఎక్కువ శాతం ఆచార్య షూటింగ్ చేసారు. అందుకే కొరటాల భారీ ఖర్చుతో టెంపుల్ సెట్‌ ని హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించారు. సినిమాక రిలీజ్ అయ్యింది. డిసాస్టర్ అయ్యింది.. కానీ ఆ సెట్ ని అలానే ఉంచేశారు మేకర్స్. 

Advertisement
CJ Advs

అయితే టెంపుల్ సెట్ లో నిన్న సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఆచార్య ధర్మస్థలి టెంపుల్ సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆచార్య సెట్ కి మంటలెలా అంటుకున్నాయి అనేది ఆ వీడియో బ్యాగ్రౌండ్ లో వినిపిస్తున్నాయి. ఆ సెట్ అగ్నిప్రమాదానికి గురవడానికి కారణం.. ఆ టెంపుల్ సెట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్‌లో మంటలు చెలరేగాయంటూ ఆ వీడియో తీసిన వారు మాట్లాడుకోవడం అందులో వినిపించింది.

అంటే జస్ట్ ఓ సిగరెట్ 20 కోట్ల సెట్ ని అగ్నికి ఆహుతి చేసింది. 20 ఎకరాల్లో 20 కోట్లతో నిర్మించిన ఈ సెట్ ని సురేష్ సెల్వరాజన్ నిర్మించారు. మరి ఆ సెట్ కాలడానికి 20 నిముషాలు కూడా పట్టలేదనే కామెంట్స్ నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి.

The reason behind the Acharya set burning?:

Acharya Movie Dharmasthali Temple Set On Fire
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs