Advertisement
Google Ads BL

ప్రభాస్ స్పిరిట్ పై డైరెక్టర్ కామెంట్స్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా ప్రేక్షకులని కాదు.. పాన్ వరల్డ్ ప్రేక్షకులని కూడా ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ప్రాజెక్ట్ K, సలార్, ఆదిపురుష్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు పక్కా ప్లానింగ్ తో రాబోతున్న ప్రభాస్.. మధ్యలో మారుతి చిత్రంలో నటిస్తూ ఫాన్స్ ఆందోళనకి కారణమయ్యారు. ఈ చిత్రం నుండి లీకులు తప్ప ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటం రాలేదు. మారుతి చిత్రాన్ని ప్రభాస్ త్వరత్వరగా పూర్తి చేసేపనిలో ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రాలన్నీ కొలిక్కి వస్తే.. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా చిత్రం స్పిరిట్ సెట్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేసిన సందీప్ వంగా.. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్పిరిట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రభాస్ తో తాను తెరకెక్కించబోయే చిత్రంపై అంచనాలు, క్రేజ్ ఎంతగా ఉన్నాయో నాకు తెలుసు, అందుకే ప్రభాస్ తో బలమైన మరియు ప్రతిష్టాత్మకమైన స్క్రిప్ట్‌ ను రాస్తున్నాను అంటూ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.

ఇంతకుముందే ఈ చిత్రంలో ప్రభాస్ ని రా అండ్ పవర్‌ఫుల్ యాక్షన్ లుక్ లో చూపించాలనే కోరికని బయటపెట్టాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. అలాగే హీరోయిన్ గా కరీనా కపూర్ ని ఎంపిక చేసే అవకాశం ఉంది.

Director comments on Prabhas Spirit:

Director Sandeep Reddy Vanga comments on Prabhas Spirit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs