నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వీడి పది రోజులు కావొస్తుంది. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పర్వదినాన తారకరత్న తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడం నందమూరి అభిమానులనే కాదు.. సామాన్యులని కూడా కంటతడిపెట్టించింది. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అయితే తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అతను మరణించినప్పటినుండి అలేఖ్య రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. భర్త మరణంతో మానసిక వేదనతో పాటు.. శారీరకంగానూ ఆమె సఫర్ అవుతుంది. తారకరత్న మృతిచెందిన మూడు రోజులకి ఆయన పుట్టినరోజు నాడు ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అలేఖ్య.. మళ్ళీ చిన్న కర్మ తర్వాత తాను తారకరత్న ఎంతగా లైఫ్ లో ఫైట్ చేసారో అనేది ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది.
పెళ్లి అయ్యాక తామెంతగా పోరాడామో.. చనిపోయేవరకు తారకరత్న ఫైట్ చేస్తూనే ఉన్నట్లుగా అలేఖ్య రెడ్డి ఆ పోస్టు లో రాసింది. తాజాగా తారకరత్న పెద్ద కర్మని కుటుంబ సభ్యులు మార్చి 2న FNCC లో ఏర్పాటు చేస్తున్నారు. బాలకృష్ణ-విజయ్ సాయి రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించబోతున్నారు. తారకరత్న పెద్ద కర్మ దగ్గరపడుతున్నకొలది అలేఖ్య దుఃఖం మరింతగా పెరిగిపోతుంది. భర్త మరణాన్ని తట్టుకోలేకపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో అలేఖ్య రెడ్డి తన భర్త తారకరత్నతో పిల్లలతో కలిసి చివరిగా పెద్ద తిరుపతిలో దిగిన పిక్ ని పోస్ట్ చేసింది.
ఆ పిక్ తో పాటుగా ఇదే మా చివరి ఫోటో. చివరి ప్రయాణం అని నమ్మడం నా వల్ల కావడం లేదు. నా హృదయం పగిలినట్లయ్యింది. ఇప్పటివరకు జరిగింది ఓ కలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. అమ్మా, బంగారు అని పిలిచే మీ పిలుపు ఒక్కసారి వినాలని ఉంది అంటూ అలేఖ్య ఎమోషనల్ గా చేసిన పోస్ట్ లో తారకరత్న అనందంగా తన పెద్ద కుమర్తె, ఇద్దరి ట్విన్స్ తో భార్య అలేఖ్యతో ఉన్న ఆ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వగా.. నందమూరి అభిమానులు ఆమెకి మద్దతుగా పోస్టు లు పెడుతూ స్టే స్ట్రాంగ్ వదినా, సిస్టర్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
తారకరత్న ఫాన్స్ అలేఖ్యని సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ లు కొన్ని..
ఏ సంబంధం లేని మాకు ఇంత బాధగా ఉంటే ఒక భార్యగా మీరు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకోగలను ధైర్యంగా ఉండండి అలేఖ్య గారు.
మీరు strong గా ఉంటేనే పిల్లలు happy ga untaru sister... తను లేరు అనే లోటు లేకుండా పెంచండి చెల్లీ... దేవుడు పెట్టె పరీక్షలలో మనిషి ఎప్పుడు వీక్ అవ్వొద్దు అప్పుడే ఎవరైనా ఎలాంటి situtaion లో కుడా ముందుకు వెళ్ళగలరు భూమి పైన బ్రతికినన్ని రోజులు మనోధైర్యాన్ని కోల్పోకుండా బ్రతికినోడు మనిషి plz sister మీరు చాలా strong avvali లేకపోతే పిల్లల విషయములో ఇంకా బాధపడాల్సి ఉంటది మరియు వాళ్ళని బాధ పెట్టినవాళ్ళం అవుతాము దయచేసి మీరు స్ట్రాంగ్ అవ్వండి సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏