Advertisement
Google Ads BL

బిగ్ బాస్ ఓటిటి సీజన్ క్లోజ్


బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కి వేళయరా అనుకుంటూ విజిల్ వేసుకుంటూ ఓటిటి ఆడియన్స్ పాడుకోవడానికి లేనట్టే కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం. గత ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే బిగ్ బాస్ ఓటిటి ని గ్రాండ్ గా లాంచ్ చేసారు డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారు. ఆ సీజన్ ఓటిటి ఆడియన్స్ ని అంతగా అట్రాక్ట్ చెయ్యలేకపోయింది. 24/7 బిగ్ బాస్ ఓటిటి ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. అందుకేనేమో సీజన్ 2 విషయంలో యాజమాన్యం కామ్ గా ఉండిపోయింది. ఎలాంటి హడావిడి చెయ్యడంలేదు.

Advertisement
CJ Advs

అందుకే ఏ కంటెస్టెంట్స్ పేరు సోషల్ మీడియాలో వినిపించడం లేదు, కనిపించడం లేదు. అసలు ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 లేనట్లే అంటున్నారు. అది నిజమనేలా ఫిబ్రవరి చివరి వారం కాదు.. నెల పూర్తయ్యి మార్చి లోకి ఎంటరైపోతున్నా బిగ్ బాస్ ఓటిటిపై ఎలాంటి అప్ డేట్ లేదు. దానితో బిగ్ బాస్ ఓటిట్ సీజన్ 2 ని ఎత్తేసారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. లేదంటే ఈపాటికి నాగార్జున లోగో లాంచ్ తో హడావిడి చేసేవారే.. సో ఈ ఏడాది ఓటిటి నుండి బిగ్ బాస్ లేనట్లే. ఇక ఏడో సీజన్ కోసం ప్రేక్షకులు వెయిట్ చెయ్యాల్సిందే.

అన్నట్టు బిగ్ బాస్ ఓటిటి 2 మొదలు కావడానికి మరో సమస్య ఉందట. అదే కంటెస్టెంట్స్ కొరత. స్టార్ మా సీజన్స్ బిగ్ బాస్ కి ఆదరణ లేకుండా పోయింది. ఇక ఓటిటిలో ఏముంటుంది అని.. ఏ కంటెస్టెంట్స్ ఓటిటి బిగ్ బాస్ కి వచ్చేందుకు సుముఖంగా లేకపోవడం.. ఈ సీజన్ ఆగిపోవడానికి ఓ కారణమనేలా ఉంది అంటున్నారు.

Bigg Boss OTT season is close:

Makers cancel Bigg Boss OTT 2, read all details inside
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs