Advertisement
Google Ads BL

NTR30 ఓపెనింగ్.. వెంటనే రెగ్యులర్ షూట్


NTR30 ఓపెనింగ్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్న కొద్దీ అది వెనక్కి వెనక్కి వెళుతుంది. లేదంటే ఈపాటికి అంటే ఫిబ్రవరి 24 సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగిపోయేది. తారకరత్న మరణంతో అది కాస్త వాయిదా పడింది. అసలే ఏడాది కాలంగా NTR30 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. దానికి అడుగడుగునా ఆటంకాలే అన్నట్టుగా ఉంది. ఆచార్య హిట్ అయితే NTR30 ఎప్పుడో సగం షూటింగ్ పూర్తి చేసేసుకునేది. ఆచార్య ఎఫెక్ట్ తో కొరటాల NTR30 స్క్రిప్ట్ విషయంలో కాస్త గట్టిగా కూర్చున్నారు.

Advertisement
CJ Advs

మార్చ్ 2న తారకరత్న పెద్ద కర్మ పూర్తి చేసాక.. మంచి రోజు చూసుకుని NTR30 పూజా కార్యక్రమాలు జరిపించాలని డిసైడ్ అయ్యారట. అయితే మార్చ్ 15 న NTR30 ఓపెనింగ్ కి ముహూర్తం బావుంది అని, 15 న హైదరాబాద్ లో సినిమా ఓపెనింగ్ ని గ్రాండ్ గా బాలీవుడ్ మీడియాలో కూడా కవర్ అయ్యేలా నిర్వహించే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. ఆ తర్వాత నాలుగు రోజులకి అంటే మార్చి 20 నుండి ఎన్టీఆర్-కొరటాల సెట్స్ మీదకి వెళ్లి రెగ్యులర్ షూట్ మొదలు పెడతారని తెలుస్తుంది.

ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరుని ఫైనల్ చేస్తారని.. అది మార్చి 6 నే ఆమె పుట్టిన రోజు స్పెషల్ గా ప్రకటిస్తారని ప్రచారం ఉండగా.. విలన్ రోల్ కోసం కొరటాల బాలీవుడ్ నటుల విషయంలో ఇంకా తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.

NTR30 shoot from this date :

NTR30 opening on march 15th.. regular shoot immediately
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs