Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ని సపోర్ట్ చేసింది, వార్తల్లో నిలిచింది


నటి కస్తూరి ప్రస్తుతం, సినిమాలకి దూరంగా సీరియల్స్ కి దగ్గరగా ఉంది. గృహలక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరైన కస్తూరి.. సీరియల్ లో పద్దతికి పట్టు చీర కట్టినట్టు కాకుండా.. రియల్ లైఫ్ లో చాలా మోడ్రెన్ మహిళ. అయితే తరచూ కాంట్రవర్సీ కామెంట్స్ తో మీడియాలో హడావిడి చేసే కస్తూరి తాజాగా ఎన్టీఆర్ అమెరికా యాక్సెంట్ పై సపోర్ట్ చేస్తూ మట్లాడడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. 

Advertisement
CJ Advs

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడానికి రామ్ చరణ్, రాజమౌళి ఫామిలీస్ తో వెళ్ళినప్పుడు.. అక్కడ మీడియాతో ఎన్టీఆర్ ఇంగ్లీష్ లోనే అమెరికా యాక్సెంట్ తో మాట్లాడడం చూసిన చాలామంది ఎన్టీఆర్ యాసపై కామెంట్స్ చెయ్యడమే కాదు.. ట్రోల్స్ చేసారు. రెండు మూడు రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. అప్పుడు జరిగిన ట్రోల్స్ పై నటి కస్తూరి తాజాగా స్పందిస్తూ.. అమెరికా వాళ్ళకి వాళ్ళ స్లాంగ్ లోనే మాట్లాడితే అర్ధమవుతుంది. 

అమెరికాలో మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఎవ్వరికి అర్థం కాదు. అందుకే ఎన్టీఆర్ అక్కడ అమెరికన్‌ యాక్సెంట్‌లో మాట్లాడాడు. ఆ విషయంలో ఎన్టీఆర్‌ చేసింది కరెక్ట్. చాలా మంది ఎన్టీఆర్ ది ఫేక్‌ యాక్సెంట్‌ అంటూ ట్రోల్‌ చేశారు. అమెరికా వాళ్లకి.. వాళ్లలాగా మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఇక్కడ తెలుగులో నా తమిళ యాక్సెంట్‌లో మాట్లాడితే అర్థమవుతుందా, అర్థం కాదు కదా.. అంటూ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడంతో ఆమెని మెచ్చుకుంటూ ఎన్టీఆర్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దానితో ఒక్కసారిగా కస్తూరి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Kasthuri comes in support of NTR:

<span>Kasthuri supports young tiger NTR</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs