Advertisement
Google Ads BL

పవన్ కి ఎన్టీఆర్ ఫాన్స్ సూటి ప్రశ్న


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న కొడుకు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్ అందుకున్నందుకు గాను సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ చెబుతూ స్పందించిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్.ఆర్.ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కీ, దర్శకులు శ్రీ రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ సోషల్ మీడియాలో పవన్ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ఆర్.ఆర్.ఆర్ మరో హీరో ఎన్టీఆర్ పేరు ఎక్కడా పలకకపోవడంపై ఎన్టీఆర్ ఫాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు.. తారక్ అన్న పేరు కూడా ఈ మేటర్ లో యాడ్ చెయ్యాల్సింది.. కానీ పవన్ కేవలం ఆర్.ఆర్.ఆర్ హీరోల్లో రామ్ చరణ్ ఒక్కడినే పనిగట్టుకుని ప్రశమించడం ఏమిటి అంటూ వారు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా గోల చేస్తే ఎన్టీఆర్ అన్న ఫీలవుతాడేమో అంటూ మధనపడిపోతున్నారు. కానీ కొంతమంది ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందులో కడుపుమండిన ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు.. ఇలా ట్వీట్ చేసాడు.

ఒకే సినిమాలో పని చేసిన ఇద్దరు నటులను  మీరు అభినందనలు చెప్పలేక పోయారు.. మీ అన్న కొడుకుకు మాత్రమే చెప్పుకున్నారు.. అలాంటి మీరు రేపు మీరు పొరపాటున సీఎం అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చెయ్యిగలరా.. అంటూ పవన్ కళ్యాణ్ ని టాగ్ చెయ్యడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. 

NTR fans direct question to Pawan:

NTR fans fires on Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs