Advertisement
Google Ads BL

బ్యాక్ టు వర్క్ అంటున్న కొత్త పెళ్లికూతురు


బాలీవుడ్ లో కొత్తగా పెళ్లి పీటలెక్కి రాజస్థాన్ సూర్యఘడ్ కోటలో కోరుకున్న ప్రియుడు హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు నడిచిన బ్యూటీ కియారా అద్వానీ.. తర్వాత అత్తగారింటికి ఢిల్లీకి, అలాగే ముంబై లో రిసెప్షన్ అంటూ హడావిడి చేసింది. తర్వాత కూడా కియారా అద్వానీ-సిద్దార్థ్ ల పెళ్లి ఫొటోస్, మెహిందీ ఫొటోస్, సంగీత్ ఫొటోస్, రిసెప్షన్ ఫొటోస్ సోషల్ మీడియాలో హడావిడి చేసాయి. అయితే పెళ్లి తర్వాత మినీ హనీమూన్ ట్రిప్ వేశారు.. సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు పెళ్లి, రిసెప్షన్ పనులన్నీ ముగియడంతో బ్యాక్ టు వర్క్ అంటూ మేకప్ వేసుకుంటున్న పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శనివారం ఫిబ్రవరి 25 అంటూ మిర్రర్ లో మొహం చూసుకుంటూ ఆ పిక్ ని షేర్ చేసింది. రామ్ చరణ్ తో కియారా అద్వానీ.. శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే వైజాగ్ లో ముగియగా.. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నారు. ఇక కియారా అద్వానీ.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ బిజీగా ఉంటుంది. పెళ్లి తర్వాత 15 రోజుల గ్యాప్ తో కొత్త పెళ్లి కూతురు కియారా బ్యాక్ టు వర్క్ అంటూ పనిలోకి దిగిపోయింది.

పెళ్లి తర్వాత కియారా పోస్ట్ చేసిన ఫస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కియారా అద్వానీ పని పని అంటూ బిజీ కాబోతుంది.  

Kiara Advani shares first post as she returns to work weeks:

Kiara Advani Is Back At Work Weeks After Her Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs