Advertisement
Google Ads BL

సర్జరీకి రెడీ అయిన జబర్దస్త్ కమెడియన్


జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ అప్పుడప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం, అలాగే కొద్దిరోజులుగా అతను నడవలేని పరిస్థితిలో ఉండడంతో జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది అతనికి బాసటగా నిలుస్తున్నారు. అతని కిడ్నీలు పాడడంతో కొద్దిరోజులు నడవలేకపోయినా.. మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత అతను కాస్త కోలుకుని షోస్ చేసుకుంటున్నాడు. ప్రసాద్ కి కిడ్నీ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు తాను భరిస్తాను అంటూ కిర్రాక్ ఆర్పీ ఒకొనొక సమయంలో మాటిచ్చాడు .

Advertisement
CJ Advs

తన ఆరోగ్యంపై ఎప్పుడూ సైలెంట్ గా ఉండే పంచ్ ప్రసాద్ త్వరలోనే కిడ్నీ ఆపరేషన్‌కు రెడీ అవుతున్నట్లుగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి, తన ఇబ్బందుల గురించి ఓపెన్‌ అయ్యాడు. పెళ్లైన కొత్తలో ముక్కులో నుంచి తరచుగా రక్తం రావడం, జ్వరం రావడంతో ఓసారి ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి నా రెండు కిడ్నీలు పాడయ్యాయన్నారు. అప్పటినుండి డయాలసిస్‌ చేయించుకుంటూ ఓ రోజు ఆసుపత్రికి వెళ్లొచ్చాక బాగా విశ్రాంతి తీసుకున్నా. కానీ ఉన్నట్లుండి జ్వరం, నడుము నొప్పి బాగా వేధించాయి. అసలు తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లాం. డాక్టర్లు మళ్లీ పరీక్షలు చేశారు. కానీ అసలు కారణం తెలుసుకోలేకపోవడంతో తాను కొద్దిరోజులు నడవలేకపోయానాని చెప్పాడు.

అలాగే ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పిన ప్రసాద్ త్వరలోనే కిడ్నీ ఆపరేషన్ చేయించుకోబోతున్నాను, దానికి కావాల్సిన కిడ్నీ డోనర్ కూడా దొరికాడు. తన కాలుకు చీము రావడం వల్లే డాక్టర్లు ఆపరేషన్‌ని వాయిదా వేశారు.. అంటూ పంచ్ ప్రసాద్ తన కిడ్నీ ఆపరేషన్ గురించి బయటపెట్టాడు.

Jabardasth comedian who is ready for surgery:

Punch Prasad For Kidney Transplant
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs