సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ తర్వాత బైక్ యాక్సిడెంట్ కి గురై దాదాపు ఆరు నెలల పాటు సినిమాలకి, షూటింగ్స్ కి దూరమయ్యాడు. తర్వాత విరూపాక్ష తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. విరూపాక్ష షూటింగ్ త్వరత్వరగా కంప్లీట్ చేసి.. ప్రస్తుతం చిన్న మేనమావ పవన్ కళ్యాణ్ తో తమిళ రీమేక్ షూటింగ్ లోకి అడుగుపెట్టేసాడు. ఆ చిత్రం పూజా కార్యక్రమాలే కాదు.. రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది.
విరూపాక్ష నుండి మార్చ్ 1 న టీజర్ రాబోతున్నట్టుగా మేకర్స్ ఈరోజే ప్రకటించారు. అయితే టీజర్ ప్రకటనతో పాటుగా సాయి తేజ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్ర ప్రమోషన్స్ పై స్పందించాడు. ఇంక వెయిటింగ్ లు ఉండవ్🙅♂️ ఓన్లీ అప్ డేట్స్ 🤗, #VirupakshaTeaser on March 1st.. అంటూ చేసిన ట్వీట్ తో మెగా ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. మెగా మేనల్లుడు సాయి తేజ్ స్పీడు కి ఫిదా అవుతున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 12 న విడుదలకు రెడీ అవుతుంది.