సోషల్ మీడియా విశేషంగా ఆదరణలోకి వచ్చాక మంచి కన్నా కూసింత చెడే ఎక్కువ జరుగుతుంది. చిన్న విషయానికి, పెద్ద విషయానికి, మంచికి చెడుకి తేడా లేకుండా పోతుంది. హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీస్ అలాగే ప్రముఖులపై ట్రోల్స్, మీమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. కొంతమంది హీరోయిన్స్ ఈ ట్రోల్స్, మీమ్స్ తట్టుకోలేక సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అయినా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఈ ట్రోల్స్, మీమ్స్ పై ఫైర్ అయ్యింది. అంతేకాకుండా ఈ మీమ్స్, ట్రోల్స్ పై ఆవేదన వ్యక్తం చేసింది.
గురు సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రితిక్ సింగ్ ఆ తర్వాత రాఘవ లారెన్స్ శివ గంగ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరైంది. అయితే రితిక సింగ్ అనుకున్నంతగా పాపులర్ అవ్వలేకపోయింది. తాజాగా రితిక సింగ్ నటించిన ఇన్ కార్ పాన్ ఇండియాలోని పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లోనే రితిక సింగ్ ఈ మీమ్స్, ట్రోల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి, హీరోయిన్స్ ఫోటోలని మార్ఫింగ్ చేసి మీమ్స్ క్రియేట్ చేసి ఆనందిస్తున్నారు.
హీరోయిన్స్ ఫోటోలని అస్సహ్యంగా ఎడిట్ చేసి అసభ్యకరమైన కామెంట్స్ తో మీమ్స్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. మాకు కుటుంబాలు ఉన్నాయి. నా ఫొటోస్ అలా చూసినప్పుడు వాళ్ళెంతగా బాధపడతారో అనేది తెలుసుకోండి. ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి అంటూ రితిక సింగ్ తన బాధని వెళ్లగక్కింది.