Advertisement
Google Ads BL

మొన్న చిరు-నేడు పవన్ కళ్యాణ్


రామ్ చరణ్ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్‌లో పాల్గొనేందుకు ఐదు రోజుల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ చరణ్ రాజమౌళి, కీరవాణి, సెంథిల్, కార్తికేయ తో కలిసి అవార్డులు అందుకుంటూ ఎంతో హడావిడి చేస్తున్న విషయం సోషల్ మీడియాలో చూస్తున్నాం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్‌లో ఆర్.ఆర్.ఆర్ ఏకంగా ఐదు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ వాయిస్‌, మోష‌న్ క్యాప్చ‌ర్స్ విభాగంలో అవార్డుల‌ను అందుకున్నారు. రామ్ చరణ్ ఈ అవార్డు వేడుకలకి వెళ్లడం, అక్కడ గుడ్ మార్నింగ్ అమెరికా షో లో పాల్గొనడంపై మెగాస్టార్ చిరు ప్రౌడ్ గా ఫీలవుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్‌లో ఆర్.ఆర్.ఆర్ అలాగే రామ్ చరణ్ అవార్డుని కొల్లగొట్టడంతో శుభాకాంక్షలు తెలిపారు.

అభినందనలు.. రామ్ చరణ్

ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్.ఆర్.ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్ ను రామ్ చరణ్  ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కీ, దర్శకులు శ్రీ రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ సోషల్ మీడియాలో పవన్ ట్వీట్ చేసారు.

Pawan Kalyan wishes to Ram Charan :

Pawan Kalyan wishes to Ram Charan and RRR team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs