Advertisement
Google Ads BL

వాల్తేర్ వీరయ్య vs ముద్దుల మావయ్య


నారా లోకేష్ ప్రస్తుతం ఏపీలో యువగళం పాద యాత్ర మొదలు పెట్టి అప్పుడే ఒక నెల పూర్తి కావొస్తుంది. చాలా యాక్టీవ్ గా లోకేష్ పాదయాత్ర సాగుతుంది. అభిమానులు, టిడిపి కార్యకర్తల మధ్యన లోకేష్ పాదయాత్ర సరదాగా, నిర్విఘ్నంగా, జగన్ పై సెటైర్స్ పేలుస్తూ, ఆయన ప్రభుత్వం చేసే తప్పులని వేలెత్తి చూపుతూ లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాడు. ఈ పాదయాత్రలో భాగంగా తిరుపతిలో లోకేష్ యువ‌త‌తో ముఖా ముఖి నిర్వ‌హించాడు. ఈవెంట్‌లో ఓ యువ‌కుడు నారా లోకేష్ ని ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసాడు. మీ అభిమాన హీరో ఎవరు? మీరు మీ మావయ్య సినిమాలు చూస్తారా? అని అడిగాడు.

Advertisement
CJ Advs

దానికి లోకేష్ స్పందిస్తూ.. నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. ఆయన లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య చూసాను. ఇక బాల మామ ఎంతైనా నా ముద్దుల మావయ్య కదా. ఆయన సినిమాలు విడుదలైన మొదటి రోజే మొదటి షో చూసేస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ గా చిరు-బాలయ్య ల విషయంలో సమాధానం చెప్పిన లోకేష్ పవన్ కళ్యాణ్ ని ఒకే ఒక్కసారి కలిసాను, అప్పుడే ఆయన మంచి మనసుని చూసాను అంటూ పవన్ పై లోకేష్ చేసిన క్రేజీ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Waltair Veerayya vs Muddula Mavayya:

Nara Lokesh, A Big Fan Of Megastar Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs