సమంత ఇప్పుడు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. సోషల్ మీడియాలో సమంత ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈమధ్యనే మాయోసైటిస్ నుండి బయటపడి ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టిన సమంత.. విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఖుషి కొత్త షెడ్యూల్ కోసం సమంత టీమ్ తో కలిసి విదేశాలకి ఎగిరిపోయింది. మరోపక్క బాలీవుడ్ లో రాజ్ అండ్ DK కొత్త వెబ్ సీరీస్ సిటాడెల్ షూటింగ్ కోసం తరచూ ముంబై వెళుతుంది.
అదలాఉంటే మాయోసైటిస్ నుండి కోలుకున్న సమంత రెగ్యులర్ గా జిమ్ చేస్తూ ఆ వర్కౌట్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే సమంత తాజాగా గుర్రమెక్కి స్వారీ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు ఆమె ఫాన్స్ వాటిని ట్రెండ్ చేస్తూ ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నారు. సమంత గుర్రపు స్వారీ చేస్తున్న పిక్ ఎక్కడిదో తెలియదు కానీ.. ఆమె బాలీవుడ్ వెబ్ సీరీస్ సిటాడెల్ కోసమే ఈ స్వారీ నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
అయితే సమంత ఏం చేసినా సెన్సేషనే అన్నట్టుగా ఆమె అభిమానులు ఆమె గుర్రపు స్వారీ పిక్స్ వైరల్ చేస్తూ యమా హ్యాపీగా ఫీలవుతున్నారు. అనారోగ్యంతో ఏమైపోతుందో అని బాధపడిన ఫాన్స్ ఇప్పుడు ఆమె మళ్ళీ యాక్టీవ్ గా మారడం చూసి సంతోషపడుతున్నారు.