పవన్ కళ్యాణ్ దేవుడిగా వెంకటేష్ చిత్రం గోపాల గోపాలలో గెస్ట్ రోల్ లో నటించారు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎవరికీ కనిపించకుండా మోడరన్ దేవుడిగా జస్ట్ వెంకటేష్ కి మాత్రమే కనిపిస్తూ సినిమాని నడిపారు. అప్పట్లో 18 రోజులకి గాను పవన్ కళ్యాణ్ పారితోషకం కింద 16 కోట్లు అందుకున్నారు. అంటే రోజుకి ఒక కోటి చొప్పున పవన్ కళ్యాణ్ పారితోషకం గోపాల గోపాలకి తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడి కేరెక్టర్ లో మరో సినిమా మొదలైంది. టాలీవుడ్ దేవుడు యమా కాస్ట్లీ అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ పారితోషికం వ్యవహారం.
పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో హిట్ అయిన వినోదియా సిత్తం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి అవతారం ఎత్తబోతున్నారు. ఈ చిత్రనికి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారు. 20 రోజులకి 60 కోట్ల పారితోషకం పవన్ తీసుకోబోతున్నారట. అంటే రోజుకి మూడు కోట్లు చొప్పున పవన్ కళ్యాణ్ పారితోషికం ఉండబోతుంది.
ఈ లెక్కన టాలీవుడ్ దేవుడు చాలా కాస్ట్లీ అని అర్ధమవుతుంది కదా. నిజంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అనేలా ఉన్నారు నిర్మాతలు. పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తూ కోట్లు పట్టుకుపోతున్నారు. అందుకే అనేది పవన్ ప్లాన్ 20 రోజులు 60 కోట్లు అని. మరి రోజుకి మూడు కోట్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. పవన్ నిజంగా నువ్వు దేవుడివేనయ్యా.