Advertisement
Google Ads BL

బాలీవుడ్ ని మరో రీమేక్ ముంచేసింది


బాలీవుడ్ కి పఠాన్ ఇచ్చిన ఊపుని రెండు రీమేక్స్ ఇప్పుడు పటాపంచలు చేసాయి. బాలీవుడ్ ఉన్న దారుణ పరిస్థితిని పఠాన్ వచ్చి తుడిచేసింది. పఠాన్ విజయాన్ని ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూన్న బాలీవుడ్ ప్రముఖులకు, అలాగే ఆడియన్స్ కి రెండు రీమేక్స్ పెద్ద షాకిచ్చాయి. 200 కోట్లు కొల్లగొట్టిన హీరో కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు 20 కోట్లు తేవడానికి నానా కష్టాలుపడుతున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అలా వైకుంఠపురములో మూవీని కార్తీక్ ఆర్యన్ షెహజాదాగా రీమేక్ చెయ్యగా శివరాత్రికి విడుదలైన ఆ మూవీని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో అక్కడ అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు బాలీవుడ్ ని మరో రీమేక్ అడ్డంగా ముంచేసింది. అది అక్షయ్ కుమార్ సెల్ఫీ. నేడు విడుదలైన అక్షయ్ కుమార్ సెల్ఫీ.. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు మధ్యన ఈగో క్లాష్ సినిమా మొత్తం ఆసక్తికరంగా మార్చేసింది. కానీ బాలీవుడ్ సెల్ఫీలో అక్షయ్ కుమార్ హీరోయిజం హైలెట్ అవుతూ ఇమ్రాన్ తో ఈగో కాకుండా వాళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం చూపించడం ప్రేక్షకులకి అస్సలు రుచించలేదు. దానితో సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అయ్యిందంటూ క్రిటిక్స్ తేల్చేసారు.

ఈరోజు శుక్రవారం విడుదలైన సెల్ఫీకి  నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం, బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాకి ప్లాప్ టాక్ ఇచ్చేసారు. దానితో పఠాన్ తో దారిలోకొచ్చిన బాలీవుడ్ బాక్సాఫీసు మళ్ళీ రెండు రీమేక్స్ తో చతికిల పడింది. ఒక్క రీమేక్ మాత్రమే కాదు.. ఇప్పుడు రెండో రీమేక్ కూడా బాలీవుడ్ ని నిట్ట నిలువునా ముంచేసింది. 

Sadly Bollywood has been drowned by another remake:

Selfie public talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs