Advertisement
Google Ads BL

లైఫ్ అంతా పోరాటమే: తారకరత్న వైఫ్ అలేఖ్య


తారకరత్నకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లేవు, అలాగే పెళ్లి తర్వాత లైఫ్ కూడా అంతా సాఫీగా సాగలేదు అనేది కళ్ళకి కట్టిన నిజం. తారకరత్న అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమనేది నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ఆయన తల్లితండ్రులకి అంతగా నచ్చలేదు అనేది తెలిసిన విషయమే. తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెద్దలని ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. తారకరత్న తల్లితండ్రులు తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యేవరకు అంతగా కలిసిన సందర్భాలు లేదంటారు. ఆస్తులు కూడా తారకరత్నకు కాకుండా తండ్రి మోహన్ కృష్ణ కూతురు పేరు మీద రాసారని ప్రచారమూ జరిగింది. అయితే 2016లో నందమూరి బాలకృష్ణ తారకరత్న పుట్టిన రోజుకి వాళ్ళ ఇంటికి వెళ్లడంతోనే నందమూరి కుటుంబంలో తారకరత్నపై ఉన్న అభిప్రాయం మారింది అంటారు. అందులో ఎంత నిజముందో ఎవ్వరికి క్లారిటీ లేదు. 

Advertisement
CJ Advs

తారకరత్న వివాహం తర్వాత అలేఖ్య రెడ్డితో కలిసి నందమూరి కుటుంబం నుండి వేరుగానే ఉన్నాడు. అటు అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ కూడా వీళ్ళ పెళ్ళికి సుముఖంగా లేకపోవడం.. విజయ్ సాయి రెడ్డి అలేఖ్య బాబాయ్ ఆమెకి సపోర్ట్ గా నిలవడం మాత్రం నిజమంటారు. ఇక పెళ్లి తర్వాత తారకరత్న కెరీర్ కానీ, బిజినెస్ కానీ ఆసించినంత స్థాయిలో లేకపోవడంతో ఎన్టీఆర్ అతని ఫ్యామిలీ ఖర్చులు కోసం నెలకి నాలుగు లక్షలు ఆర్ధిక సహాయం చేసాడంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటే..

తారకరత్న మరణించినప్పటినుండి స్టిల్ ఈరోజు వరకు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అనారోగ్యం పాలుకూడా అయింది. ఆమెని ఓదార్చడం ఎవ్వరి తరము కావడం లేదు. 

అయితే తాజాగా ఆమె ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూస్తే ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తుంది. లైఫ్ లో ఎన్నో పోరాటాలు చేసాము, నీవు జీవించిన చివరి క్షణం వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాము, కార్లలొ నిద్రించిన రోజుల నుండి మన జీవితం ఇప్పటివరకు సాఫీగా సాగలేదు. ఈ పోరాటంలో చాలా దూరం వచ్చేసాం, నువ్వొక వారియర్ నాన్నా. 

నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఎవ్వరూ చూపించలేదు అంటూ అలేఖ్య రెడ్డి తారకరత్న హ్యాండ్ తో తన హ్యాండ్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని పోస్ట్ చేసిన విధానం చూస్తే ఎన్నో సంఘటలను, మరెన్నో జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉంది.

Life is all about struggle: Taraka Ratna wife Alekhya:

Taraka Ratna Wife Alekhya Reddy Emotional Post On His Marriage Life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs