Advertisement
Google Ads BL

NBK108 కొత్త షెడ్యూల్ అప్పటినుండే


నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో డిసెంబర్ లో మొదలైన NBK108 షూటింగ్ కొత్త షెడ్యూల్ వీరసింహారెడ్డి ప్రమోషన్స్ వలన, తారకరత్న హెల్త్ రీజన్ వలన షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అయితే ఫిబ్రవరి 24 నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాలని బాలయ్య-అనిల్ రావిపూడి అనుకున్నారు. కానీ తారకరత్న మరణం వలన ఆ షెడ్యూల్ వాయిదా పడింది. మళ్ళీ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈమధ్యలో తారకరత్న పెద్ద కర్మ పనులవి ఉన్నాయి. బాలయ్య ఆ పనులు చూసుకోవాలి.

Advertisement
CJ Advs

అయితే మార్చ్ 12 నుంచి NBK108 కొత్త షెడ్యూల్ మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సింగిల్ రోల్ లోనే మూడు వేరియేషన్స్ చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. యంగ్ గా, తండ్రిగా బాలయ్య కనిపిస్తారని.. శ్రీలీల కి తండ్రి కేరెక్టర్ లో బాలయ్య కొద్దిరోజులు జైలు జీవితం గడపడంతో కూతురు ఆయన్ని ద్వేషిస్తుంది.. తర్వాత అతనెందుకు జైలుకెళ్లాడో తెలుసుకుని పశ్చాత్తాపపడుతుంది అంటూ NBK108 కథపై కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటించబోతుంది, అందుకోసం ఆమె భారీగా డిమాండ్ చేస్తుంది అంటున్నారు.. కానీ హీరోయిన్ విషయం ఫైనల్ అవ్వాల్సి ఉంది.

NBK108 new schedule from then on:

NBK108 new schedule from March 12th?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs