కోలీవుడ్ హీరో శింబు లైఫ్ లో ఉన్న ప్రేమ కథలు నిజంగా మరే ఇతర హీరో లైఫ్ లో లేవనే చెప్పాలి. త్రిష దగ్గరనుండి హన్సిక, నయనతారలతో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటలేక్కబోతున్న తరుణంలో బ్రేకప్స్ చేసుకుని ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్న శింబు.. అటు కెరీర్ లోను లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. ఆ మధ్యన శింబు తన తండ్రి రాజేంద్ర కుదుర్చిన వివాహం చేసుకోబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. మధ్యలో రాజేందర్ ఆరోగ్యం పాడవడంతో ఆయనకు విదేశాల్లో చికిత్స ఇప్పించారు. ఇక శింబు పెళ్లి విషయం మరుగున పడిపోయింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి శింబు పెళ్లి వార్త కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లుకొడుతుంది. శింబు ఓ వ్యాపారవేత్త కూతురితో ప్రేమలో ఉన్నాడని, ఇప్పటికే ఇరు కుటుంబాలు శింబు పెళ్లి విషయమై మాట్లాడేసుకుని పెళ్లి పనులు మొదలు పెట్టేశాయంటూ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అయితే శింబు ప్రేమించిన అమ్మాయి శ్రీలంకకు చెందిన అమ్మాయి అంటున్నారు. ఆమె తండ్రికి శ్రీలంకలో చాలా వ్యాపారకాలున్నాయని, శింబు అంటే ఆమెకి వీరాభిమానం కావడంతో.. ఓసారి శింబుని కలిసేందుకు ఆమె రావడంతో.. అది పరిచయంగా, తర్వాత ప్రేమగా మారి పరిస్థితి పెళ్లివరకు దారితీసినట్లుగా చెబుతున్నారు.
ఇరువురు పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో, శింబు అతి త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యాడంటూ కోలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వినబడుతుంది.