Advertisement
Google Ads BL

సలార్: శృతి పార్ట్ కంప్లీట్


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో సలార్ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు ఆద్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా సలార్ టీమ్ ఓ స్పెషల్ పిక్ తో ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ కటౌట్ కి సరిపోయే బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి హాసన్ ఆద్య గా నటిస్తుంది. ఆద్య పాత్రలో శృతి హాసన్ ఎలాంటి యాక్షన్ చేసింది.. ప్రభాస్ తో ఎంతగా రొమాంటిక్ యాంగిల్ చూపించిందో, సాంగ్స్ లో ఎలాంటి గ్లామర్ చూపించబోతుందో.. అని అభిమానులు ఆరాటంలో ఉన్నారు.

Advertisement
CJ Advs

అదలాఉంటే.. ప్రస్తుతం శృతి హాసన్ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో ప్రశాంత్ నీల్ తో శృతి హాసన్ క్యూట్ గా దిగిన ఫోటోని షేర్ చేస్తూ మేకర్స్ ప్రకటించారు. It's a wrap for Aadya, @shrutihaasan ♥️ అంటూ సలార్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ప్రకటించారు. మరి ప్రభాస్-పృథి రాజ్ సుకుమారన్ యాక్షన్ పార్ట్ కూడా పూర్తయ్యింది అని తెలుస్తుంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది అంటున్నారు.

షూటింగ్ పూర్తవగానే సలార్ నుండి భారీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అది టీజర్ అయినా అవ్వొచ్చు, లేదంటే సలార్ గ్లిమ్ప్స్ అయినా అవ్వొచ్చనే టాక్ నడుస్తుంది.

Salaar: Shruti Haasan completes shooting:

Shruti Haasan completes shooting from Salaar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs