Advertisement
Google Ads BL

రామ్ చరణ్ అయ్యప్ప మాల ఏమైంది


రామ్ చరణ్ రెండురోజుల క్రితం గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఆయన వెళుతున్నప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా, అయ్యప్ప మాల వస్త్రాధరణలో వెళ్లారు. రామ్ చరణ్ ఎక్కువగా ఆధ్యాత్మికతతో ఉంటాడంటూ పవన్ కళ్యాణ్ ఓ టాక్ షోలో చెప్పారు. ఎప్పుడూ ఏదో ఒక మాలలో చరణ్ కనిపిస్తాడంటూ ఆయన చేసిన కామెంట్స్ తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ హైదరాబాద్ నుండి అమెరికా ఫ్లైట్ ఎక్కేముందు అయ్యప్పమాలలో వెళ్లారు. అక్కడికి వెళ్ళాక రామ్ చరణ్ సూపర్ స్టైలిష్ అవతార్ లోకి చేంజ్ అయ్యారు. రామ్ చరణ్ డ్రెస్, అలాగే ఆయన షూస్, ఇంకా స్టయిల్ మొత్తం మారిపోయింది.

Advertisement
CJ Advs

ఆ షోలో పాల్గొనడానికి రామ్ చరణ్ అదే మాలాధారణలో వస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేసారు. కానీ రామ్ చరణ్ మాలని పక్కనబెట్టి ఇలా కొత్తగా కనబడుతున్నారనే అనే సందేహంలో చాలామందిలో మొదలయ్యింది. సోషల్ మీడియాలో దీనిపై డిస్కర్షన్ మొదలయ్యింది. అయితే రామ్ చరణ్ అయ్యప్పమాల దీక్ష నిన్నటితో 21 రోజులు పూర్తవడంతో.. అక్కడ దేవాలయంలో చరణ్ మాల కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎప్పటిలా మోడరన్ అవతార్ లోకి మారిపోయినట్లుగా తెలుస్తుంది. 

సో రామ్ చరణ్ సూపర్ స్టైలిష్ గానే ఆ గుడ్ మార్నింగ్ అమెరికా షోకి హాజరయ్యారు. అంతేకాకుండా రామ్ చరణ్ అక్కడ షో కోసం రెడీ అయిన తీరు ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.

What happened to Ram Charan Ayyappa Mala?:

Ram Charan retired from Ayyappa initiation in America
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs