Advertisement
Google Ads BL

US లో ఉపాసన డెలివరీ?


మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటినుండి ఆమె పుట్టిల్లు, మెట్టినిల్లు ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోతున్నాయి. మెగాస్టార్-సురేఖలైతే ఆ ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో చూపించారు. ఇక ఉపాసన పుట్టింట్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాసన ఎక్కడకనిపించినా మీడియా మాత్రం ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ కోసం వెంటపడుతుంది. అదలాఉంటే పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఉపాసన డెలివరి ఆగష్టులో కానీ.. లేదంటే ఒక నెల అటు ఇటుగా జరగొచ్చని మొన్నామధ్యన మెగాస్టార్ చెప్పారు. అయితే ఇప్పుడు ఉపాసన డెలివరీ అమెరికాలో జరగబోతుందని అనుమానాలొచ్చేలా రామ్ చరణ్ అమెరిలో ఓ షోలో మట్లాడారు.

Advertisement
CJ Advs

US లో రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు. ఈ షోలో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసిన యాంకర్, తండ్రి కాబోతున్న ఫీలింగ్ ఎలా ఉంది అంటూ చరణ్ ని ప్రశ్నించింది.  దానితో చరణ్ ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో ఎప్పుడూ నా భార్య ఉపాసనతోనే టైమ్ స్పెండ్ చెయ్యాలని ఉంటుంది. కానీ సినిమాలు, షూటింగ్స్ వలన నేను ఒక చోటు నుండి మరోచోటుకి వెళ్లాల్సి ఉంటుంది. డెలివరీ సమయంలో తనని నాతో ప్రయాణం చేయించలేను. నా లక్ ఇవాళ మిమ్మల్ని కలిశాను. నా భార్యని కూడా అమెరికాకు తీసుకు వస్తాను, తనని మీరే చూసుకోవాలి అని అడిగారు.

దానికి ఆ యాంకర్ కచ్చితంగా, మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా అంటూ చరణ్ తో చెప్పింది. అయితే యాంకర్ డెలివరీ చెయ్యడమేమిటో అనుకునేలోపు రామ్ చరణ్ ఆమెకి థాంక్యూ చెబుతూ.. ఆమె అమెరికాలోనే ఫేమస్ డాక్టర్ అని ఇండియన్ ఫాన్స్ కి తెలియజేశారు. ఈ వీడియోని గుడ్ మార్నింగ్ అమెరికా షో వాళ్ళు పోస్ట్ చేయగా అది వైరల్ అవడమే కాదు.. ఉపాసన డెలివరీ కోసం అమెరికా వెళ్లే ఛాన్స్ వుంది అంటూ చర్చించేస్తున్నారు.

Ram Charan And Upasana To Welcome First Child In US?:

Father-to-be Ram Charan appears on Good Morning America
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs