Advertisement
Google Ads BL

కన్నీరు మున్నీరుగా తారకరత్న భార్య అలేఖ్య


నందమూరి తారకరత్న కన్నుమూసి ఐదు రోజులు గడిచిపోయింది. అయినా ఆయన భార్య అలేఖ్యని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. తారకరత్న అలేఖ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యి 15 ఏళ్ళు ముగియకముందే ముగ్గురు పిల్లలని, అలేఖ్యని ఒంటరి వాళ్ళని చేసి తారకరత్న తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడం అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతోంది. నిన్న ఐదోరోజు కుటుంబ సభ్యులు చిన్నకర్మ నిర్వహించారు. తారకరత్న భౌతికకాయం దగ్గరే కాదు.. నిన్న చిన్న కర్మలోనూ అలేఖ్య కన్నీరు మున్నీరు అవుతూనే ఉంది.

Advertisement
CJ Advs

ఇక తారకరత్న కి 40 ఏళ్ళు వచ్చే నాలుగు రోజుల ముందు కన్ను ముయ్యడం ఆమెని మరింతగా బాధపెట్టింది. ఫిబ్రవరి 22 న తారకరత్న పుట్టినరోజు కావడంతో నిన్న అలేఖ్య భర్త ని తలచుకుంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పెద్ద బిడ్డ నిష్కతో తారకరత్న ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. నా లైఫ్ లో బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్ నువ్వే అంటూ ఎమోషనల్ గా హ్యాపీ బర్త్ డే.. నిన్ను చాలా మిస్ అవుతున్న అంటూ చేసిన పోస్ట్ చూస్తే ఆమె ఎంతగా తారకరత్న మరణంతో దిగులుపడిపోయి ఎమోషనల్ గా మారిందో అర్ధమవుతుంది.

Emotional Post On Tarakaratna 40th Birthday:

Tarakaratna wife Alekhya Reddy emotional post
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs