Advertisement
Google Ads BL

పెను ప్రమాదం బయటపడ్డ హీరో విశాల్


కోలీవుడ్ హీరో విశాల్ ఎప్పటికప్పుడు ప్రమాదాలకు ఎదురెళ్తాడు. యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా కష్టపడతాడు. రిస్కీ ఫైట్ చేసి దెబ్బలు తింటాడు, గాయాల పాలవుతాడు. గత రెండేళ్లలో రెండుసార్లు విశాల్ షూటింగ్స్ స్పాట్స్ లో ప్రమాదాలకు గురై చికిత్స తీసుకున్నాడు. యాక్షన్, లాఠీ చిత్రాల యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సందర్భంలో విశాల్ గాయాలపై కొన్నాళ్ళు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు. రియల్ స్టంట్ అంటూ ప్రమాదాలకు గురవుతాడు.

Advertisement
CJ Advs

తాజాగా ఇలాంటి పెను ప్రమాదం నుండే విశాల్ మరోసారి తప్పించుకున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోనీ చేస్తున్న విశాల్.. ఆ షూటింగ్ సెట్స్ లో ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తుండగా సెట్ లోని ఒక వ్యాన్ గోడను నెట్టుకుని ఒక్కసారిగా లోపలి రావడంతో చిత్ర బృందం మొత్తం తప్పుకున్నారు. అదే సమయానికి విశాల్ కూడా అక్కడే ఉండి ఆ ప్రమాదంలో గాయపడకుండా తప్పుకోవడం ఆయన అభిమానులు ఊపిరి తీసుకునేలా చేసింది. వాహనంపై అదుపుతప్పి అలా గోడని ఢీ కొట్టి అయితే ఈ ఘటనని విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..  దేవుడి దయ వలన కొన్ని క్షణాల వ్యవధిలో చావు నుండి తప్పించుకున్నాను అంటూ పోస్ట్ చేసాడు.

ఆ వీడియో చూసిన అభిమానులు విశాల్ అన్న జాగ్రత్త జరా చూసుకుని చెయ్యరాదే అంటున్నారు. యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోండి అంటూ అభిమానులు సలహాలు ఇస్తున్నారు.

Stunt sequence goes wrong at Mark Antony sets; Vishal:

Big accident on the shooting spot of Vishal Mark Antony
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs