Advertisement
Google Ads BL

సీక్రెట్ గా ఫొటోస్ తియ్యడంపై అలియా ఫైర్


సెలబ్రిటీస్ అంటే మీడియాకి ఫుల్ ఫోకస్ ఉంటుంది. వాళ్ళేం డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళేం తింటున్నారు, వాళ్ళెలాంటి చెప్పులు వేసుకున్నారు. ఎవరితో కలిసి తిరుగుతున్నారు, ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారంటూ మీడియా వాళ్లపై ఓ నిఘానేత్రం పెడుతుంది. కానీ వాళ్ళకి ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇంటికెళ్ళాక వారెలా ఉంటారో సీక్రెట్ గా చూద్దామంటే దానికన్నా నీచం మరొకటి ఉండదు. పబ్లిక్ ఫిగర్స్ అయితే పబ్లిక్ లో ఉన్నప్పుడే వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి కానీ.. ఇంకెళ్లాక వారిపై కెమెరాలతో ఫోకస్ పెడితే ఎలా ఉంటుంది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అలియా భట్ విషయంలో అదే జరిగింది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గత ఏడాది రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుని.. ఓ పాపకి తల్లయ్యింది. పాప పుట్టిన ఓ నెల రోజులు సైలెంట్ గానే ఇంట్లో ఉన్న అలియా భట్ మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసి యోగ, జిమ్ బాట పట్టింది. అయితే అలియా భట్ తన ఇంట్లో లివింగ్ రూమ్ లో ఉండగా ఆమెని పక్క బిల్డింగ్ మీద నుండి ఓ ఇద్దరు ఫొటోస్ తియ్యడం చూసిన అలియా భట్ ఫైర్ అయ్యింది. 

తాను ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉండగా.. నన్నెవరో గమనించినట్లుంది పక్కకి తిరిగి చూడగానే ఎవరో ఇద్దరు పక్క బిల్డింగ్ నుండి తన ఫొటోస్ తీస్తూ కనిపించారు. ఇది కరెక్ట్ నా? మీరు హద్దులు దాటి ప్రవర్తించారంటూ అలియా భట్ ఇన్స్టా లో వాళ్లపై ఫైర్ అయ్యింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫొటోస్ తియ్యడమంటే తమ పర్సనల్ లైఫ్ కి భంగం కలిగించడమే అంటూ అలియా భట్ తన పోస్ట్ ని ముంబై పోలీస్ లకి టాగ్ చేసింది.

Alia Bhatt is under fire for taking photos secretly:

Alia Bhatt gets furious on paparazzi for clicking her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs