మరో రెండు రోజుల్లో(ఫిబ్రవరి 24) యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో NTR30 పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగాల్సి ఉండగా.. నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న కన్నుముయ్యడంత్రో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. దానితో అటు ఎన్టీఆర్ తన సినిమా ఓపెనింగ్ ని, ఇటు బాలయ్య బాబు తన NBK108 షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎప్పటినుండో NTR30 ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్ కొద్దిగా డిస్పాయింట్ అయినా.. ఆ ఫ్యామిలిలో జరిగిన విషాదం వారి ఆనందాన్ని పక్కనబెట్టేలా చేసింది.
అయితే ఈ నెల 24 న పోస్ట్ పోన్ అయిన NTR30 పూజా కార్యక్రమాలు ఈ నెల 30న నిర్వహించబోతునాన్రు. ఈలోపులో తారకరత్న కి జరగాల్సిన పెద్ద కర్మ కార్యక్రమాలు పూర్తవుతాయని, దానితో ఫిబ్రవరి 30న ఉదయం 9.10 నిమిషాలకి రామోజీ ఫిల్మ్ సిటీలో కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబో మూవీ ని గ్రాండ్ గా మొదలు పెట్టేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా.. ఈ ఓపెనింగ్ కి టాలీవుడ్ ప్రముఖులు ,ముఖ్యంగా ప్రభాస్, రాజమౌళి తో పాటుగా చాలామంది హాజరయ్యే అవకాశం ఉంది.. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్-యువ సుధా ఆర్ట్స్ కలయికలో భారీ పాన్ ఇండియా చిత్రంగా NTR30 తెరకెక్కబోతుంది.. అంటూ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.
అయితే ఫిబ్రవరికి 30వ తేదీ లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎన్టీఆర్ ఫాన్స్ ఈ ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో గుడ్డిగా స్ప్రెడ్ చెయ్యడం చూస్తే.. ఎన్టీఆర్ ఫాన్స్ ఈ సినిమా మొదలయ్యేందుకు ఎంతగా ఎదురు చూసి, ఎంతగా విసిపోయారో అనేది పూర్తిగా అర్ధమవుతుంది. అయితే NTR30 ఎప్పుడు మొదలవుతుందో అనేది మాత్రం ఇంకా అధికారికంగా ఏ న్యూస్ మేకర్స్ ప్రకటించలేదు.