Advertisement
Google Ads BL

ఇకపై అలాంటి పాత్రలే చేస్తాను: రాశి ఖన్నా


ఇప్పటివరకు యంగ్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో కి, ఇంకా డ్యూయెట్స్ పాడుకునే పాత్రలకే పరిమితమైన రాశి ఖన్నా ఇప్పుడు హిందీ వైపు వెళ్ళింది. తెలుగు, తమిళ్ భాషల్లో కేవలం అందాలు ఆరబొయ్యడం, రెండు పాటల్లో హీరోతో కలిసి డాన్స్ చెయ్యడమే పనిగా పెట్టుకుంది. అలాంటి పాత్ర తప్ప పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలేవీ రాశి ఖన్నా కెరీర్ లో తగల్లేదు. ఇక ఈ మధ్యన హిందీలో తెరకెక్కి పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలైన ఫార్జి వెబ్ సీరీస్ లో మేఘ గా రాశి ఖన్నా ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

నటికి అందమే కాదు.. కానీ అదే అందంతో సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టం. ఎక్కువ కాలం ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలంటే.. ఇకపై డిఫరెంట్ కథా చిత్రాల ఎంపిక చేసుకుని నటించడం ముఖ్యమని గ్రహించినట్టుగా చెప్పిన రాశి ఖన్నా ఇప్పటివరకు జాలిగా, గ్లామర్ పాత్రల్లో చూడడానికి అభిమానులు ఇష్టపడ్డారు. తనకి కూడా ఇలాంటి పాత్రలే వచ్చాయి. ప్రతిభని చూపించాలంటే వైవిద్యభరితమైన చిత్రాలని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్టుగా రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఈమధ్యన సోషల్ మీడియాలో రాశి ఖన్నా అదిరిపోయే గ్లామర్ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టేస్తుంది. ఇవన్నీ అవకాశాల కోసమే అనుకున్నవారికి రాశి ఖన్నా ఇలా షాకిచ్చి.. ఇకపై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తా అంటుంది.  

Raashi Khanna will do such roles from now on:

Raashi Khanna wants to do different films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs