కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జునకి వరస పరాభవాలు తప్పడం లేదు. వైల్డ్ డాగ్, బంగార్రాజు, ది ఘోస్ట్ ఇలా వరసగా వచ్చిన సినిమాలేవీ నాగార్జునని శాటిస్ఫాయ్ చెయ్యలేదు. బంగార్రాజు హిట్ అయినా దానిలో సగం చైతూ పట్టుకుపోయాడు. అందుకే ఘోస్ట్ తర్వాత బిగ్ బ్రేక్ ఇచ్చి నాగార్జున సినిమా చెయ్యాలా.. లేదంటే ఓటిటిలో వెబ్ సీరీస్ చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఆయన కూడా అదే చెప్పారు. ఆరు నెలల గ్యాప్.. అప్పుడే నిర్ణయమని. ఘోస్ట్ రిలీజ్ అయ్యి ఆరు నెలలు కావొస్తుంది. కానీ నాగార్జున కొత్త సినిమా ముచ్చట ఇంకా కానరావడం లేదు.
అయితే తాజాగా నాగార్జున ఓ రీమేక్ పై మక్కువ చూపుతున్నారంటున్నారు. మలయాళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మలయాళంలో జోజు జార్జ్ నటించిన పోరింజు మరియం జోస్ అనే సినిమా పై నాగ్ కన్ను పడిందట. జోజు జార్జ్ కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న పోరింజు మరియం జోస్ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ ని రీమేక్ చెయ్యాలని నాగార్జున డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
గత ఆరు నెలలుగా నాగార్జున ఎప్పుడు సినిమా ప్రకటిస్తారా అని అక్కినేని ఫాన్స్ వెయిటింగ్. అటు చూస్తే చిరు, బాలయ్య, వెంకీలు సినిమాల మీద సినిమాలు చేస్తూ పోతున్నారు. కానీ నాగ్ ఇలా గమ్మునుండడం మాత్రం అభిమానులకి నచ్చడం లేదు.