Advertisement
Google Ads BL

భార్య లేకుండానే కాస్ట్లీ ఇంట్లోకి ధనుష్


గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య, రజినీకాంత్ డాటర్ ఐశ్వర్య లు విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకులు తీసుకున్నా పిల్లల కోసం ధనుష్-ఐశ్వర్యలు అప్పుడప్పుడు కలుస్తున్నారు. ఇక విడాకుల తర్వాత ధనుష్ ఆయన మాజీ భార్య ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. తాజాగా ధనుష్ తమిళనాట వాతి తోనూ తెలుగులో సార్ తో మంచి హిట్ కొట్టాడు. ఇక సార్ హడావిడి ముగియడంతో ధనుష్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. ధనుష్ చెన్నైలో 150 కోట్లతో ఎంతో ఇష్టపడి కట్టుకున్న కాస్ట్లీ హౌస్ లోకి రీసెంట్ గానే గృహప్రవేశం చేసాడు. తన భార్య లేకుండానే ధనుష్ కొత్తింట్లోకి అడుగుపెట్టాడు.

Advertisement
CJ Advs

ఎందుకంటే ధనుష్ తన భార్య కి విడాకులు ఇవ్వకముందే చెన్నై లోని ఖరీదైన ప్రాంతం పోయెస్ గార్డెన్ లో ఈ కొత్తింటిని మొదలు పెట్టాడట. తన భార్య పిల్లలతో ధనుష్ అదే ఇంట్లో ఉండాలని ఆశపడినప్పటికీ.. కొన్ని కారణాల వలన భార్యతో విడిపోవాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 18 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం ఎవరికి నచ్ఛలేదు. వీరిద్దరూ మళ్ళీ కలవాలని రజిని అభిమానులు చాలా ఆశ పడినప్పటికీ అది జరగలేదు. ఇక ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ పనులు పూర్తవ్వడంతో.. తాజాగా ఆయన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపుగా 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

అన్నిరకాల సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో ధనుష్ ఈ ఇంటిని ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్ గృహపవేశం పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Dhanush hosts housewarming ceremony:

Dhanush hosts housewarming ceremony for his new home in Chennai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs