Advertisement
Google Ads BL

అంత బాధలోనూ అభిమానుల కోరిక ఒక్కటే


నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ తనయుడు, హీరో తారకరత్న హార్ట్ ఎటాక్ తో కన్ను మూయడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. గత 23 రోజులుగా ఆసుపత్రిలో తారకరత్న ఉంటే.. కుటుంభం మొత్తం బెంగుళూరు వెళ్ళింది. ఇక తారకరత్న కన్నుమూసాక హైదరాబాద్ తీసుకురాగానే ఫ్యామిలీ మొత్తం తారకరత్న నివాసానికి వెళ్ళింది. సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసిన తర్వాత ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు భార్యలతో కలిసి బెంగుళూరు వెళ్లి పరామర్శించి వచ్చారు. అలాగే తారకరత్న భౌతిక కాయం నివాశానికి రాగానే అన్నదమ్ములిద్దరూ వెళ్లి నివాళులు అర్పించి అలేఖ్యని ఓదార్చి వచ్చారు. అయితే ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ వచ్చి కాసేపు ఉండి వెళ్లిపోయారు.

Advertisement
CJ Advs

అక్కడ మొత్తం బాలకృష్ణనే చూసుకుంటున్నారు. ఇక నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తారకరత్న భౌతిక కాయాన్ని తరలించగానే ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో, కళ్యాణ్ రామ్ తన అమ్మతో కలిసి వచ్చి తారకరత్న దగ్గర ఎమోషనల్ అయ్యి కాసేపు ఉండి వెళ్లిపోయారు. మళ్ళీ తారకరత్న అంత్యక్రియల సమయానికి నేరుగా ఈ అన్నదమ్ములు మహాప్రస్థానానికి వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా ఓకె. కానీ బాలకృష్ణ-ఎన్టీఆర్ ఎదురెదురు పడలేదు. పడినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు బాలకృష్ణ అక్కడ కనిపించలేదు

ఇప్పుడే కాదు తారకరత్న కోసం ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్ళినప్పుడు కానీ, తారకరత్న నివాసానికి ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు కాని బాలయ్య అక్కడ లేరు. ఇక ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు అప్పటిదాకా అక్కడే కనిపించిన బాలయ్య వాళ్ళు రాగానే తప్పుకున్నారు. అంత్యక్రియల సమయంలో గంధపు చెక్కలు వేసే దగ్గర బాలయ్య పక్కనుండి ఎన్టీఆర్ వచ్చి చితి మీద గంధపు చెక్కలు వేసాడు. కానీ బాలయ్య అది పట్టించుకోనట్లే ఉండిపోయారు. ఈ తతంగం అంత చూసిన నందమూరి అభిమానులు తారకరత్న మరణంతో  కుంగిపోయి ఉండడమే కాదు.. ఎన్టీఆర్-బాలయ్య ల మధ్యన తెలియని అగాధం అగాధం ఉంది అంటూ మధనపడిపోతున్నారు. వారిద్దరూ అలా ఎడ మొహం పెడ మొహంగా ఉండడం ఫాన్స్ కి నచ్చడం లేదు.

ఎన్టీఆర్ ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీకి దూరమే. హరికృష్ణ మాటతో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో కలిసి ఉంటున్నాడు. కానీ నందమూరి కుటుంబం మాత్రం ఎన్టీఆర్ ని కాస్త దూరం కాదు ఎంతగా దూరం పెట్టిందో నిన్నటి ఘటనని చూసిన దగ్గర నుండి అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. అంత బాధలోనూ అభిమానులు ఆ పై పిక్ ని షేర్ చేస్తూ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. Villu idharu okari mokam okaru chusukoni undaru, ila unte ela swamy 🙏🙏🙏🙏 అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Even in such pain, fans have only one desire:

 Nandamuri fans have only one wish
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs