నందమూరి తారకరత్న చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో 23 రోజుల చికిత్స అనంతరం ఈ శివరాత్రి రోజున కన్ను మూసిన విషయం తెలిసిందే. అన్న కొడుకు తారకరత్న అలా ఆసుపత్రి పాలైనప్పటినుండి నందమూరి బాలకృష్ణ తారకరత్న చెంతనే ఉన్నారు. ఆఖరికి నిన్న జరిగిన అంత్యక్రియల్లోను బాలయ్య తారకరత్న పాడే మోసి అన్నయ్య మోహన కృష్ణతో అంత్యక్రియలు పూర్తి చేయించారు. అన్న కొడుకు అలా నిర్జీవంగా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుని బాలయ్య బాగా ఎమోషనల్ అయ్యారు.
అయితే వైసిపి ఎంపీ.. తారకరత్నకు చినమామగారు అయిన విజయ్ సాయి రెడ్డి బాలకృష్ణ తారకరత్న గురించి ఎంతగా పరితపించిపోయారో చెప్పారు. తారకరత్న ఆసుపత్రిలో ఉంటే.. బెంగుళూరుకి దాదాపు పదిసార్లు ఆసుపత్రికి వెళ్లి చూసారు, డాక్టర్స్ తో మట్లాడారు. ఆయన చాలా కృషి చేసారు తారకరత్నని బ్రతికించేందుకు, కానీ బ్రతికించేలేకపోయారు.
తారకరత్న ఫ్యామిలీని బాలకృష్ణగారు దగ్గరుండి చూసుకుంటున్నారు. తారకరత్న లేకపోయినా.. అలేఖ్యని పిల్లలని తన ఫ్యామిలీ మెంబెర్స్ లా చూసుకుంటాము, వాళ్ళకి ఎలాంటి లోటు రానివ్వమని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. తారకరత్న మరణంతో అలేఖ్య కాస్త మానసిక సంఘర్షణకి లోనవడంతో ఆమె కాళ్ళు చేతులు వొణుకుతున్నాయి, అది పెద్దగా ఇబ్బంది లేదు.. ఈ కష్టాన్ని భరించాలి, త్వరలోనే రికవరీ అవుతుంది, తారకరత్న విషయంలో బాలకృష్ణ గారు చేసింది మాత్రం ఎప్పటికిమరచిపోలేము అంటూ విజయ సాయి రెడ్డి చెప్పారు.
తారకరత్న ఫ్యామిలీతో బాలకృష్ణకి బాగా బాండింగ్ ఉంది అనేది ఆయన పిల్లలతో బాలయ్య ఉన్న తీరు చెబుతుంది. తారకరత్న కొడుకుతో బాలకృష్ణ చేయించాల్సిన కార్యక్రమాలను చేయించారు, అన్నతో దగ్గరుండి తారకరత్నకు తలకొరివి పెట్టించారు. అందుకే నందమూరి ఫాన్స్.. బాలయ్య గ్రేట్ అనేది.