Advertisement
Google Ads BL

NTR30 ఓపెనింగ్ పోస్ట్ పోన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కలయికలో తెరకెక్కబోయే NTR30 ఎట్టకేలకు ఈ నెల 24 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్న సమయంలో ఇప్పుడు దానికి అంతరాయం వచ్చిపడింది. నందమూరి హీరో తారకరత్న అకాల మరణంతో ప్రస్తుతం నందమూరి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. తారకరత్న గత శనివారం కన్నుమూయగా.. ఈరోజు సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇంతటి దుఃఖంలో NTR30 పూజా కార్యక్రమాలు జరపడం కరెక్ట్ కాదని.. NTR30 ఓపెనింగ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

Advertisement
CJ Advs

ఎప్పటినుండో NTR30 ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇది డిస్పాయింటింగ్ న్యూస్ అయినప్పటికీ.. నందమూరి కుటుంబం ఉన్న పరిస్థితుల్లో దానిని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఒప్పుకుంటున్నారు. ఫిబ్రవరి 24 న పూజా కార్యక్రమాలతో సినిమాని మొదలు పెట్టి.. మార్చ్ 20 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయ్యింది. త్వరలోనే NTR30 ఓపెనింగ్ కోసం మరో మంచి తేదీ నిర్ణయించి ప్రకటిస్తారని తెలుస్తుంది. 

NTR30 opening postponed :

NTR - Koratala Film Launch Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs