Advertisement
Google Ads BL

ఆదిపురుష్ లో ఆ సీన్ కి అన్ని కోట్లా?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ కలయికలో 3D లో తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ లో విడుదలకి రెడీ అవుతుంది. ఓమ్ రౌత్ ప్రభాస్ ని రాముడిగా ఓ రేంజ్ లో చూపిస్తాడని ఆశపడిన ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తో భంగపడ్డారు. రాముడిగా ప్రభాస్ కటౌట్ ని ఊహించుకున్న ఫాన్స్ కి ప్రభాస్ యానిమేషన్ లో కదులుతుంటే ఏడుపొచ్చింది. దానితో హడావిడిగా సినిమాని పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. ఆ తర్వాత ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో విడుదల చేస్తున్నామంటూ ఆసక్తిని రేకెత్తించారు.

Advertisement
CJ Advs

తాజాగా ఆదిపురుష్ టీజర్ ని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయబోతున్నారనే న్యూస్ మొదలయ్యింది. అదలావుంటే ఇప్పుడు ఆదిపురుష్ పై సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ఒకటి ప్రభాస్ ఫాన్స్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ఆదిపురుష్ క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ లో ప్రభాస్.. సైఫ్ అలీ ఖాన్ రావణుడికి సంబధించిన రాక్షసులు పై చేసే యుద్ధం సన్నివేశం సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలవబోతుందట. ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే.. మేకర్స్ ఏకంగా 12 కోట్లు ఖర్చు చేశారనే న్యూస్ అందరిలో ఇంట్రెస్ట్ ని కలిగించింది.

ఈ చిత్రం కోసం ప్రభాస్ విలువిద్యలో శిక్షణ తీసుకున్నాడు. మేకోవర్ కోసం విదేశాలకు వెళ్ళాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డాడు. వి షేప్ కోసమే ప్రభాస్ రిస్క్ కూడా చేశాడంటూ ఓమ్ రౌత్ ఎప్పుడో చెప్పాడు.

A bomb spent on Adipurush scenes:

Adipurush scenes create a sensation <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs