Advertisement
Google Ads BL

విపరీతంగా ఎగ్జైట్ అవుతున్న ప్రభాస్ ఫాన్స్


ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో తన్నుకు చచ్చే ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వరస అప్ డేట్స్ తో కునుకురావడం లేదు. మూడు నెలలో సినిమా చొప్పున ప్రభాస్ ఫాన్స్ కి ట్రీట్ ల మీద ట్రీట్స్ అందబోతున్నాయి. జూన్ లో ఆదిపురుష్ అది వచ్చిన మూడు నెలలకే సలార్.. అది వచ్చిన మూడు నెలలకే ప్రాజెక్ట్ K.. ప్రభాస్ ఫాన్స్ ఎంతగా ఎగ్జైట్ అవుతున్నారో మాటల్లో వర్ణించలేము. బాహుబలిని ఐదేళ్లపాటు ఎంజాయ్ చేసిన వారికి సాహో, రాధే శ్యామ్ రిజల్ట్స్ నిరాశపరిచాయి. టీజర్ తో డిస్పాయింట్ చేసిన ఆదిపురుష్ పై కూడా నమ్మకం లేదు.

Advertisement
CJ Advs

కానీ సలార్, ప్రాజెక్ట్ K లపై విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. రెండు సినిమాలు పాన్ ఇండియా హిట్స్ అని బలంగా నమ్ముతున్నారు. ఆదిపురుష్ కూడా ఏ మ్యాజిక్ చేసినా అది కూడా ప్రభాస్ కి మంచి పేరు తెస్తుంది. ఈ మూడు సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాని ఏలెయ్యొచ్చు. ఎలాగూ ఎన్టీఆర్-రామ్ చరణ్-అల్లు అర్జున్ లాంటి హీరోలు ఈ ఏడాది వచ్చే అవకాశం లేదు. సో అంతా మా సినిమాల మోతే అన్నట్టుగా ప్రభాస్ ఫాన్స్ మొదటిసారి విపరీతమైన ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. ఊపిరి సలపనంతగా సోషల్ మీడియాని ఆక్యుపై చెయ్యాలని వారు డిసైడ్ అయ్యారు. 

సలార్ మాస్ హిట్ పక్కా, ప్రాజెక్ట్ K బాహుబలిని మించి హిట్ అవడం పక్కా.. రాజమౌళి రికార్డ్స్ ని ప్రాజెక్ట్ K తుడిచినా తుడిచేస్తుంది అంటూ వారు కనే కలలు మాములుగా లేవు. మరి ప్రభాస్ ఫాన్స్ గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే అంటూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Prabhas fans are extremely excited:

 Prabhas fans say festival every three months
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs