Advertisement
Google Ads BL

తారకరత్న కుమార్తెని ఓదార్చిన బాలయ్య


నందమూరి తారకరత్న హార్ట్ ఎటాక్ తో నిన్న శివరాత్రి పర్వదినాన కన్నుమూయడంతో నందమూరి కుటుంబం ముఖ్యంగా తారకరత్న భార్య పిల్లలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తారకరత్నని హైదరాబాద్ లో మోకిలా లోని తన స్వగృహానికి తరలించిన తర్వాత ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సినీ రాజకీయప్రముఖులు తారకరత్న నివాసానికి తరలి వెళుతున్నారు. తారకరత్న భౌతిక కాయం ఇంటికి చేరగానే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, విజయసాయి రెడ్డిలు వెళ్లి నివాళుల అర్పించారు. తర్వాత మురళి మోహన్, బోండా ఉమా, దేవినేని ఉమా తదితరులు నివాళుల అర్పించారు. నారా చంద్రబాబు బాయుడు, లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి వెళ్లారు.

Advertisement
CJ Advs

ఇక బాలకృష్ణ, చిరంజీవి తారకరత్న భౌతిక కాయనికి పుష్ప గుచ్చాలు ఉంచి నివాళు అర్పించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. బాలయ్య వెళ్లి తారకరత్న భార్యని ఓదార్చుతూ విజయ్ సాయి రెడ్డితో మాట్లాడుతున్న సందర్భంలో తారకరత్న కుమర్తె పరిగెత్తుకుంటూ వెళ్లి బాలయ్యని కౌగిలించుకోవడం చూపురులని కంటతడి పెట్టించింది. 20 రోజులుగా తారకరత్న భార్య, కుమర్తె బెంగుళూరులో తారకరత్న దగ్గరే ఉంటున్నారు. బాలయ్యకి-తారకరత్న ఫ్యామిలీకి మంచి అనుభందం ఉంది. అలా బాలయ్య రాగానే తారకరత్న కుమర్తె వెళ్లి కౌగిలించుకోవడమే కాదు.. పాప ఏడుస్తుండగా బాలయ్య ఆప్యాయంగా ఆమె కళ్ళు తుడుస్తూ ఓదార్చారు.

తారకరత్న భౌతిక కాయం దగ్గర ఆయన కుమర్తె ఈ రోజు ఉదయం నుండి ఏడుస్తూనే ఉంది. ఎవరు ఓదార్చినా పాప మాత్రం కన్నీళ్లు పెడుతుంది. బాలయ్య తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కూడా ఆయన తారకరత్న ఫ్యామిలీని ఓదారుస్తున్నారు.

Tarakaratna daughter who cried holding Balayya:

Taraka Ratna Daughter Crying After See Her Father Dead Body
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs