సీనియర్ నరేష్ ఇంటిపై దుండగులు దాడి చెయ్యడం కలకలం సృష్టించింది. గత రాత్రి నరేష్ ఇంటిపై దాడికి తెగబడ్డ డుండడుగులు నరేష్ కారుని ధ్వంశం చేసినట్టుగా నరేష్ సీసీఎస్ పోలీస్ లకి ఫిర్యాదు చేసారు. తన మాజీ భార్య రమ్య రఘుపతి తన ఇంటిపై దాడికి దుండగులని పంపించింది అంటూ నరేష్ ఆరోపణలు చేస్తూ పోలీస్ లకి ఫిర్యాదు చేసారు. నటి పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్ళికి సిద్దమవడంతో రమ్య రఘుపతి నరేష్ ని పవిత్రని వెంటాడుతూ మీడియాకి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.
అయితే నరేష్ పవిత్ర లోకేష్ ని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టుగా ప్రకటించడంతో రమ్య రఘుపతి యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని తనకి విడాకులు ఇవ్వకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారో చూస్తాను అంటూ ఆమె ఛాలెంజ్ చేసింది. ఇంతకుముందు కూడా తనని చంపేందుకు రమ్య రఘుపతి మనుషులని పురమాయించగా.. వారు తన ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించారంటూ నరేష్ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి తన ఇంటిపై దాడి రమ్యరఘుపతి దాడి చేయించగా కొన్ని వాహనాలు కారవ్యాన్ దెబ్బతిన్నట్టుగా నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ లు నరేష్ ఇంటి దగ్గర సీసీ టివి ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.