గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడి.. శివరాత్రి రోజున మృత్యువడిలోకి చేరుకున్న నందమూరి యువ హీరో తారకరత్న మృతి తో నందమూరి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి ఆసుపత్రిలో చేరి 23 రోజులుగా కోమాలోనే ఉన్న తారకరత్న తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడం నందమూరి అభిమానులని కంటతడి పెట్టించింది.
ఎలాగైనా బ్రతికి వస్తాడనికి ఆశగా ఎదురు చూసిన కుటుంబాన్ని, అభిమానులని అన్యాయం చేసి చిన్న వయసులోనే శివైక్యం చెందిన తారకరత్న భౌతిక కాయం బెంగుళూరు నారాయణ హృదయాలయ నుండి హైదరాబాద్ లోని మోకిలా లో తారకరత్న నివాసానికి కొద్దిసేపటి క్రితమే తరలించారు. ఈరోజు ఆయన నివాసంలోనే భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తారు. రేపు ఉదయం ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం తారకరత్న భౌతిక కాయాన్ని ఉంచి.. రేపు సాయంత్రం మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ మనమడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన స్వయంకృషితో ఎదిగారు. అప్పట్లో ఆయన పరిచయమే ఓ సంచలనం. ఆయన హీరోగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభమవ్వడం ఇండస్ట్రీలో ఓ రికార్డు.