కొద్దిరోజుల క్రితం కుప్పంలో లోకేష్ పాదయాత్రలో సడన్ గా కుప్పకూలి హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పం ఆసుపత్రికి తరలించగా.. తారకరత్న పరిస్థితి క్రిటికల్ కండిషన్ లోకి వెళ్లిపోయారు. దానితో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనని బెంగుళూరు నారాయణ హృదయాలకి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. బాలకృష్ణ తన అన్న కొడుకు తారకరత్న కోసం చాలారోజులు పాటు ఆసుపత్రిలోనే ఉన్న ఆయన తారకరత్న భార్యకి, నందమూరి ఫ్యామిలీకి ధైర్యాన్ని చెబుతూ వచ్చారు. నందమూరి ఫ్యామిలీ మొత్తం బెంగుళూరుకి వెళ్లి తారకరత్నని పరామర్శించి వచ్చింది.
23 రోజులుగా బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతున్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.. తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి హైదరాబాద్ లోని మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు.. తారకరత్న 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. తారకరత్న కోలుకోవాలంటూ కుటుంబ సభ్యులు చేసిన పోరాటం, అభిమానుల ఆరాటం తీరకుండానే తారకరత్న తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు.
ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి తారకరత్న భౌతిక కాయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.. అదే రోజు అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు... జరుగుతాయని తెలుస్తుంది.