బెంగుళూరు నారాయణ హృదయాలయలో గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. విదేశీ వైద్య బృందం తారకరత్న ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు, తారకరత్న ఆరోగ్యం విషయంలో అందుతున్న సమాచారం మేరకు.. తారకరత్న క్రిటికల్ కండిషన్ లోకి వెళ్లడంతో నందమూరి బాలకృష్ణ, ఇంకా కుటుంబ సభ్యులు బెంగుళూరుకి బయలు దేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్స్ కుటుంబ సభ్యులతో తారకరత్న ఆరోగ్యంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది.
తారకరత్న గుండె పోటుతో ఆసుపత్రిలో అడ్మిట్ అవగా.. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడంతో మెదడు కాస్త దెబ్బతినడమేకాకుండా.. శరీరంలోని ఇంకా కొన్ని అవయవాలు డ్యామేజ్ జరిగింది. ఇప్పటివరకు నారాయణ హృదయాల వైద్యులు, అలాగే నందమూరి ఫ్యామిలీ విదేశాల నుండి రప్పించిన వైద్యులు, స్పెషల్ గా వచ్చిన న్యూరాలజిస్ట్ లు తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. గత రెండురోజులుగా బ్రెయిన్ స్కాన్ చేసి ప్రస్తుతం పరిస్థితిని డాక్టర్స్ సమీక్షిస్తున్నారని, తారకరత్న కొద్దికొద్దిగా అత్యంత క్రిటికల్ కండిషన్ లోకి వెళుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం కుటంబ సభ్యులు డాక్టర్స్ తో చర్చించి తారకరత్నని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎయిర్ అంబులెన్సు ద్వారా తారకరత్నని బెంగుళూరు నుండి హైదరాబాద్ కి తరలించాలని.. అది కూడా ఈరోజు రాత్రే జరగొచ్చని తెలుస్తుంది.