మా వ్యక్తిగత విషయాలు మీకెందుకు, మా పర్సనల్ విషయాలను డిస్కర్స్ చేస్తూ మీరెందుకు సొమ్ము చేసుకుంటున్నారు, సినీప్రముఖులు వ్యక్తిగత జీవితాలతో ఎందుకాడుకుంటున్నారు, ఊరూ పేరు లేని ఛానల్స్ సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నాయి అంటూ సీనియర్ నరేష్ మరోసారి ఫేక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై ధ్వజమెత్తారు. నటి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్న నరేష్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తమ వ్యక్తిగత జీవితానికి భంగంకలిగిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీస్ లని, నాంపల్లి కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసు పురోగతి గురించి తెలుసుకునేందుకు ఆయన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై మరోసారి విరుచుకుపడ్డారు. కొన్ని ఛానెల్స్ వల్ల మీడియాకి, సినీ పరిశ్రమకు మధ్య దూరం పెరిగిపోయిందని, ఫేక్ ఛానల్స్ వలన మీడియాకి చెడ్డ పేరు వస్తుంది, తమ వ్యక్తిగత విషయాలను మీడియాలో ఎలా, ఎందుకు డిబేట్ లు పెడుతున్నారు, అందుకే నేను ఈ విషయమై ఫైట్ చేస్తున్నాను, సినిమా ఇండస్ట్రీ తరుపున నేను వీటిపై యుద్ధం చేస్తున్నాను, ఒక వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి, అతడి బెడ్‌రూం, బాత్‌రూం లో ఉండి అన్ని విషయాలు విన్నట్టే ఆ వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారు. దీని మీద సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరి లైఫ్ వాళ్లది. దేశంలో చాలా టాపిక్స్ ఉన్నాయి. తిండిలేక లక్షలాదిమంది చచ్చిపోతున్నారు. వాళ్ళ గురించి మట్లాడుకోండి.
కొద్దిరోజులుగా కొన్ని డిస్టబింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. నాకు మాత్రమే కాదు. ఓవరాల్‌గా సినీ పరిశ్రమలో ఉన్నవారికి కొన్ని డిస్టబింగ్ కాల్స్ వస్తున్నాయి. వీటన్నింటిపై ఫైట్ చేస్తున్నాను. ఈ విషయంలో సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పరువునష్టం దావా కేసు వేశాను. దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దాని రిజల్ట్ ఏంటనేది నేను మళ్లీ మీడియా ముందుకు వచ్చి చెబుతాను అంటూ నరేష్ మట్లాడారు.