Advertisement
Google Ads BL

విగ్నేష్ కి అవకాశం ఇచ్చిన విలక్షణ నటుడు


ఈమధ్యన నయనతార భర్త విగ్నేష్ శివన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కారణం ఆయనని అజిత్ సినిమా నుండి లైకా ప్రొడక్షన్స్ వారు తప్పించడమే. నయనతారకు-విగ్నేష్ శివన్ కి వివాహమైన కొద్దిరోజులకే అజిత్ తో సినిమా కమిట్ చేయించి AK62 పై అఫీషియల్ ప్రకటన ఇప్పించారు. అయితే అజిత్ తునివి రిజల్ట్ తర్వాత విగ్నేష్ శివన్ సినిమా విషయంలో ఆయన చెప్పిన కథ కి శాటిస్ఫాయ్ అవ్వలేక వెనకడుగు వెయ్యడంతో లైకా ప్రొడక్షన్స్ వారు విగ్నేష్ శివన్ ని ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించడంతో విగ్నేష్ శివన్ మౌనంగా వెళ్ళిపోయాడు.

Advertisement
CJ Advs

తర్వాత సోషల్ మీడియాలో.. అజిత్ పై నయన్ కి కోపమొచ్చింది, తన భర్తకి అవమానం జరిగిన కారణంగా ఇకపై నయనతార అజిత్ తో సినిమాలు చేసే అవకాశం లేదు అనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా విగ్నేష్ శివన్ తన కథకి సరిపోయే హీరోని వెతికేసాడట. అది తనని నానుం రౌడీనే సినిమాతో డైరెక్టర్ ని చేసిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ముందుకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. విజయ్‌ సేతుపతి, విఘ్నేష్‌ శివన్‌ కాంబినేషన్‌కి తమిళనాడులో ఎప్పుడూ స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. అంతేకాకుండా విజయ్ సేతుపతి -విగ్నేష్ లు మంచి ఫ్రెండ్స్ కూడా. కాత్తువాక్కులే రెండు కాదల్‌ వీళ్ళ కాంబోలోనే వచ్చిన ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

అయినప్పటికీ విజయ్ సేతుపతి స్నేహితుడికి మరో అవకాశం ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. విజయ్ సేతుపతి ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్  లో బిజీగా వున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో విలన్ గాను నటిస్తున్న విజయ్ సేతుపతి డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని విగ్నేష్ శివన్ తో చెయ్యి కలుపుతాడని తెలుస్తుంది. 

Vijay Sethupathi And Vignesh Shivan To Collaborate Again ?:

Will Vignesh Shivan be teaming up with Vijay Sethupathi for Wikki 6?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs