పవన్ కళ్యాణ్ నీడ, ఆయనకి అత్యంత ఆప్త మిత్రుడు ఎవరంటే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అందరికి తెలుసు. తనని పవన్ ని విడదీసాడంటూ బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై పగ పెంచుకోవడమే కాదు, సోషల్ మీడియాలో పేరు ఎత్తకుండా తిట్టిపోస్తున్నాడు. అదలాఉంటే త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా అంతే క్లోజ్ గా, అంతే అనుబంధాన్ని పెంచుకుంటారనేది చూస్తున్నాము. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా ఎవరితోనైనా మంచి బంధాన్ని మెయింటింగ్ చేస్తారు. కాకపోతే పవన్ తో కాస్త ఎక్కువ.
అందులోను పవన్ కళ్యాణ్ చేసే రీమేక్ లకి త్రివిక్రమ్ కర్త, కర్మ, క్రియ. పవన్ తో రీమేక్స్ చేసే దర్శకులు త్రివిక్రమ్ కింద పని చెయ్యాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇకపై పవన్ కి కథ చెప్పాలని ఏ మీడియమో, ఏ చిన్న డైరెక్టరో వెళ్లాలంటే ముందుగా త్రివిక్రమ్ దగ్గరకి వెళ్లి పవన్ తో మీటింగ్ కోసం మాట్లాడి, కథ చెప్పాల్సి వస్తుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చాలామంది దర్శకుల్లో అదే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్ కన్నా ముందు గురూజీని ప్రసన్నం చేసుకుంటే చాలనే ఊహల్లో చాలామంది ఉన్నారు.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ కి అయితే అంత అవసరం ఉండదు. పవన్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వొచ్చు.. కానీ కొత్త దర్శకులు, చిన్న, మీడియం దర్శకులకి మాత్రం ముందు త్రివిక్రమ్ దిక్కు. తర్వాతే దేవుడి దర్శనం అన్నమాట.