Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ని మ్యాచ్ చెయ్యలేకపోయాడు


అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ లు అలా వైకుంఠపురములో తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అల్లు అర్జున్ ధనవంతుడిగా, సామాన్యుడిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అదరగొడితే.. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పూజా హెగ్డే లుక్స్ అన్ని సినిమాని సక్సెస్ చేసాయి. అదే హిట్ సినిమాని హిందీలో షెహజాదా గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ రీమేక్ చేసాడు. ఆ సినిమా నేడు హిందీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అసలు బజ్ లేకుండా విడుదలైన ఈ సినిమాకి అదే రేంజ్ లో టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది.

Advertisement
CJ Advs

సినిమా చూసిన ప్రేక్షకులు..  అలా వైకుంఠపురములో చూసి షెహజాదా చూస్తే బోర్ కొట్టేస్తుంది, అలా వైకుంఠపురములో ప్రతి సీన్ ని డ్యాన్స్ మూమెంట్స్ అలాగే మ్యూజిక్ ని షెహజాదా తో ముడిపెడితే.. ఏ విధంగానూ సరితూగవంటున్నారు. అలా వైకుంఠపురములో అటు మ్యూజికల్ హిట్ కూడా. కానీ షెహజాదా లో ఆ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చెయ్యలేకపోయింది, కార్తీక్ తన నటనతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో పోలిస్తే మాత్రం అటు సినిమా పరంగాను అంతగా మెప్పించలేదు, అలాగే కార్తీక్ ఆర్యన్ ని అల్లు అర్జున్ తో పోలిస్తే అల్లు అర్జున్ బెస్ట్ అని అంటున్నారు. కార్తీక్ ఆర్యన్ ఏ విధంగానూ అల్లు అర్జున్ కి మ్యాచ్ చెయ్యలేకపోయాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కృతి సనన్ ఏ సీన్ లోనూ పూజ హెగ్డే లా అందంగా, గ్లామర్ గా మెస్మరైజ్ చెయ్యలేకపోయింది, ఆమె లుక్స్ అంతగా ఇంప్రెస్స్ చెయ్యవు అంటున్నారు. ఆమె పాత్ర కూడా అంతగా ఏమీ ఆకట్టుకోదు అని అంటున్నారు. ఇక దర్శకుడు రోహిత్ దావన్ అలా వైకుంఠపురములో కథను కరెక్ట్ గా హిందీ తెరపైకి తీసుకురాలేకపోయాడు అనే కామెంట్స్ చేస్తున్నారు. అటు క్రిటిక్స్ కూడా పూర్ రేటింగ్స్ ఇచ్చారు. అయితే సినిమాలో డైలాగ్స్ తో పాటు కొన్ని సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉన్నాయి అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

అయితే ఎందుకో ఏమిటో షెహజాదా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. అలాగే ఈరోజు ముంబైలోని కొన్ని థియేటర్స్ ఆక్యుపెన్సీ చూస్తే షెహజాదా కి పూర్ ఓపెనింగ్స్ అయితే గ్యారెంటీగా కనబడుతుంది.

Kartik Aaryan not matched Allu Arjun:

Kartik Aaryan vs Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs