సంతోష్ శోభన్ సినీ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో. సంతోష్ శోభన్ సినిమాలకి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సపోర్ట్ ఉండడమే కాదు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ ఉంది. అయినప్పటికీ.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో పరిస్థితి చూస్తే జాలేస్తుంది. గత నెల సంక్రాంతి సమయంలో కళ్యాణం కమనీయం అంటూ వచ్చి ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయిన సంతోష్.. ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబు తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
రేవు విడుదల కాబోతున్న శ్రీదేవి శోభన్ బాబు ని ఎంతగా ప్రమోట్ చేస్తున్నా సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి కానీ, ట్రేడ్ లో బజ్ కానీ లేకపోవడం చూసిన వారు అయ్యయ్యో ఈ యంగ్ హీరో సంతోష్ పరిస్థితి ఏమిటి ఇలా అయ్యింది అనుకుంటున్నారు. నాగబాబు లాంటి నటుడు, చిరు కుమర్తె సుష్మిత కొణిదెల లాంటి నిర్మాత ఉన్నప్పటికీ సినిమాపై ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడమే లేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని.. ఇన్నాళ్ళకి విడుదలవుతున్న ఈ సినిమా ఎక్కడా సౌండ్ చెయ్యడం లేదు.
అసలే ఈ రోజు విడుదలైన సార్ కి యావరేజ్ టాక్ వచ్చేసింది. ఇక వినరో భాగ్యము విష్ణు కథ కూడా విడుదల కాబోతుంది. ఈరెండు సినిమాల మధ్యన శ్రీదేవి శోభన్ బాబు మాట, ఊసు ప్రేక్షకుడి నోటా లేదు. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావనే టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. పాపం సంతోష్ కి ఎంత సపోర్ట్ ఉన్నా.. ఈ పరిస్థితి ఏమిటో కదా.