గతంలో అడపాదడపా సినిమాల్లో కనిపించే హీరోయిన్ రాశి ఖన్నా బరువు తగ్గి గ్లామర్ పెంచాక పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. పక్కా కమర్షియల్ తర్వాత తెలుగులో, అక్కడ తమిళంలోనూ రాశి ఖన్నా సందడి లేదు. ఎప్పుడూ గ్లామర్ పాత్రలతోనే హైలెట్ అయిన రాశి ఖన్నా ఇప్పుడు పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫార్జి లో మేఘ రోల్ చేసింది. డీసెంట్ గానే ఆ రోల్ లో కనిపించిన రాశి ఖన్నా కి ఆ వెబ్ సీరిస్ ఎంతగా ఉపయోగపడుతుందో అప్పుడే చెప్పలేము. అంతేకాకుండా హిందీలో మరో మూవీ యోధా లో నటిస్తుంది.
అయితే తెలుగు, తమిళంలో ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు, త్వరలోనే పెళ్లి ఏమైనా చేసుకోబోతున్నారా అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదా అని అడిగితే.. అదేం లేదు సినిమాలకి బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో మూడు కథలు, తమిళంలో రెండు కథలు విన్నాను. అవి చర్చల దశలో ఉన్నాయి. ఫార్జి స్ట్రీమింగ్ తర్వాత నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేసాను. త్వరలోనే సౌత్ లో నా కొత్త సినిమా మొదలవుతుంది.. అతి త్వరలోనే ప్రకటనలు వస్తాయంటూ చెప్పింది.
ఇక ఈ మధ్యన చాలామంది హీరోయిన్స్ అనారోగ్యానికి గురవడం వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అని మీరనుకుంటున్నారా అని అడిగితే.. నేను నా పనిని ఎప్పుడూ ప్రెజర్ లా ఫీలవ్వలేదు. నటనని ఎంజాయ్ చేస్తాను. నార్మల్ పాత్ర చేసినా, ఛాలెంజింగ్ రోల్ చేసినా కూల్ గానే ఉంటాను, సో నేను ఆరోగ్యంగా ఉన్నాను, అంతకు మించిన ఆనందంతో నా పనిని ప్రేమిస్తున్నాను, దీనిని నేను అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.