నందమూరి బాలకృష్ణ ఆహా షో కోసం అల్లు అరవింద్ గారి కాపాండ్ లో అంటే ఆల్మోస్ట్ మెగా కాంపౌండ్ లోనే అడుగుపెట్టేసారు. అది నిజంగా మెగా హీరోలకి ఎలా ఉందో కానీ చూసే వారందరికీ పెద్ధ షాక్. ఈమధ్యన మెగాస్టార్ చిరు అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాతగా కాకుండా బాలయ్యని స్పెషల్ గా తీసుకురావడానికి అల్లు-మెగా గొడవలెనా అని చిరుని డైరెక్ట్ గా అడిగితే.. ఆయన నాకున్న బిజీ షెడ్యూల్స్ వలనో.. లేదంటే వేరే కారణాలతోనే అల్లు అరవింద్ బాలకృష్ణని పిలిపించాడు. అందులో కొత్త విషయం ఏమి లేదు అని తేల్చేసారు.
అయితే అంత బిజీ షెడ్యూల్స్ లో అన్ స్టాపబుల్ సీజన్ 1 కానీ సీజన్ 2 కి కానీ మెగాస్టార్ చిరు అతిధిగా బాలయ్య షో కి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ నే పుట్టుకొచ్చిన అల్లు అరవింద్ కి చిరుని పట్టుకురావడం పెద్ధ లెక్కకాదు, కానీ చిరు రాలేదు. అంటే చిరు కోపంగా ఉన్నారనే దానర్ధం. పోనీ మెగాస్టార్ సినిమా షూటింగ్స్ తో నందమూరి నటసింహానికి ఎదురు పడలేదనుకోవచ్చు. కానీ స్మిత నిజం షోకి మెగాస్టార్ ఎలా వెళ్లారనేది నెటిజెన్స్ వాదన.
చిరు బిజీగా వున్నారు, అందుకే అన్ స్టాపబుల్ కి వెళ్ళలేదు. కానీ స్మిత నిజం షో కి ఆ బిజీ ఎక్కడికి పోయింది. ఇక్కడికి వెళ్ళని వారు అక్కడికెలా హౌ అని అడుగుతున్నారు వారు. మరి నెటిజెన్స్ అన్నదానిలో తప్పేమి లేదు. ఇదే ప్రశ్న మనకూ వస్తుంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కి చిరు వస్తారని అన్నా అది జరగలేదు. మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు నిజం షోలో మెరవడంపై మారేదన్నా కారణం అనే అనుమాలు మొలకెత్తాయి మరి.